Sasirekha Full Song : ‘మన శంకరవరప్రసాద్ ‘ లో లవ్ యాంగిల్ బాగానే ఉందిగా !!
Sasirekha Full Song : ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతార సరికొత్త లుక్స్‌లో కనిపించి తమ కూల్ స్టెప్స్‌తో అదరగొట్టారు
- Author : Sudheer
Date : 07-12-2025 - 2:24 IST
Published By : Hashtagu Telugu Desk
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన లవ్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రోమోతోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ పాట, ఫుల్ సాంగ్ విడుదలయ్యాక ఆ అంచనాలను పదింతలు చేసింది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతార సరికొత్త లుక్స్‌లో కనిపించి తమ కూల్ స్టెప్స్‌తో అదరగొట్టారు. చిరు, నయన్ జోడీ మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు మరింత హైలైట్‌గా నిలిచింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ‘వేరే లెవెల్’ అంటూ సంగీత ప్రియుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
Indigo Flights Cancellation: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 115 విమాన సర్వీసులు రద్దు
‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలోని ఈ లవ్ సాంగ్ లిరిక్స్ ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘శశిరేఖ ఓ మాట చెప్పాలి.. చెప్పాక ఫీలు కాకా.. ఓ ప్రసాదూ మోమాటల్లేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ…’ అంటూ సాగే ఈ సాహిత్యం మెగాస్టార్‌పై నాయికకున్న ప్రేమను, ఆయన వ్యక్తం చేయలేని భావాలను సూచిస్తుంది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించగా, భీమ్స్ సిసిరోలియో స్వయంగా మధుప్రియతో కలిసి ఆలపించారు. ఈ పాట సందర్భం విషయానికి వస్తే, చిరంజీవి పాత్ర ఓ సాధారణ వ్యక్తిగా ఉంటూ, ధనవంతురాలైన నయనతారను ప్రేమిస్తే, ఆ ప్రేమను వ్యక్తం చేసే సందర్భంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. గతంలో విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘మీసాల పిల్ల’ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో, ఈ తాజా లవ్ సాంగ్ కూడా యూత్‌ను, సంగీత ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
ఈ చిత్రంలో చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ వంటి నటులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.