Vishwaguru Ugadi Awards 2024: ఉగాది పురస్కారం అందుకున్న సంధ్యారాగం సినిమా దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి
వివిధ రంగాల్లో నిష్ణాతులైన సుమారు 40 మంది కళాకారులు, విద్యావేత్తలు, వైద్యరంగ నిపుణులు, సినీ ప్రముఖులు తదితరులకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానం ఘనంగా జరిగింది.
- By Praveen Aluthuru Published Date - 02:28 PM, Tue - 16 April 24

Vishwaguru Ugadi Awards 2024: వివిధ రంగాల్లో నిష్ణాతులైన సుమారు 40 మంది కళాకారులు, విద్యావేత్తలు, వైద్యరంగ నిపుణులు, సినీ ప్రముఖులు తదితరులకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానం ఘనంగా జరిగింది. బేగంపేటలోని ప్లాజా హోటల్లో సంస్థ సీఈవో సత్యవోలు రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పెరుగు శ్రీసుధ ముఖ్య అతిధిగా హాజరై ఉగాది పురస్కారాలను అందజేసి సన్మానించారు.
కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ లక్ష్మీకాంతం, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్, పారిశ్రామిక వేత్త ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవార్డులు అందుకున్న వారిలో సినిమా విభాగంలో సినీ దర్శకుడు శ్రీనివాస్ నేదునూరికి ఈ పురస్కారాన్ని అందజేశారు. వృద్ధుల పట్ల నేటి తరం ప్రవర్తిస్తున్న తీరును ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ…. మనసులను కదిలించే సంధ్యారాగం చిత్రాన్ని రూపొందించడమే కాకుండా , సామాజాన్ని జాగృతం చేసే పలు రచనలు చేసినందుకుగాను శ్రీనివాస్ నేదునూరి ఈ ఉగాది పురస్కారం అందుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ సందర్భంగా శ్రీనివాస్ నేదునూరి మాట్లాడుతూ తన రచనలను , సంధ్యారాగం సినిమాను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఫౌండర్ & సీఈవో సత్యవోలు రాంబాబు గారికి , జ్యూరి కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత సామాజిక బాధ్యతను పెంచిందన్నారు. సీనియర్ సినిమా జర్నలిస్ట్ వినాయకరావు ,ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస్, సామాజిక సేవలో బి.విజయ్ కుమార్, లయన్ బీవీఎస్ రావు, డాక్టర్ ఎన్ఎన్వీ సుబ్బా రావు, కోన శ్రీనివాసరావు, ఎం.ఎస్ విజయకుమార్, భవాని, వినోద్, వ్యాపార వేత్త, నిశ్చయం గ్రూప్ సీఈవో విష్ణుప్రియ తదితరులు ఉన్నారు.
Also Read: X Fee : పోస్ట్, రిప్లై ఆప్షన్లు కావాలంటే పేమెంట్ చేయాల్సిందే : మస్క్