Two Intevals for Ranbhir Animal : ఒక సినిమా రెండు ఇంటర్వెల్స్.. ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా..?
Two Intevals for Ranbhir Animal అర్జున్ రెడ్డి తో డైరెక్టర్ గా తన సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగ అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్
- By Ramesh Published Date - 03:31 PM, Tue - 31 October 23

Two Intevals for Ranbhir Animal అర్జున్ రెడ్డి తో డైరెక్టర్ గా తన సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగ అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ అనిపించుకున్నాడు. ఇక తన థర్డ్ మూవీ రణ్ బీర్ కపూర్ తో యానిమల్ చేస్తున్నాడు సందీప్. ఈ సినిమా విషయంలో ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. డిసెంబర్ 1న రిలీజ్ లాక్ చేసిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ మూవీగా యానిమల్ రాబోతుంది.
ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో రెండు ఇంటర్వెల్స్ ప్లాన్ చేస్తున్నారట సందీప్ వంగ. అర్జున్ రెడ్డి సినిమాను కూడా ముందు 4 గంటల దాకా ఫైనల్ చేశారట. కానీ అన రన్ టైం అయితే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారని 3 గంటలకు కుదించారు. యానిమల్ (Animal) సినిమా కూడా 4 గంటల దాకా రన్ టైం వస్తుందట. అయితే దాన్ని 3 గంటల 30 నిమిషాలకు తీసుకు రావాలని చూస్తున్నారు.
Also Read : Nani Hi Nanna : ఎమోషనల్ సినిమా అన్నారు.. ప్రచార చిత్రాలు ఇంత ఘాటుగా ఉన్నాయేంటి..?
అయితే 3:30 గంటలు కూడా ఎక్కువే అందుకే ఈ సినిమాలో సందీప్ వంగ (Sandeep Vanga) రెండు ఇంటర్వెల్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. రెండున్నర గంటల సినిమాకు ఒక ఇంటర్వెల్ ఉంటుంది అయితే యానిమల్ 3 గంటల 30 నిమిషాలు కాబట్టి రెండు ఇంటర్వెల్స్ ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయితే మాత్రం ఇలా రెండు ఇంటర్వెల్స్ తో సినిమాల ట్రెండ్ మొదలవుతుందని చెప్పొచ్చు.
సందీప్ వంగ స్కెచ్ ఏంటో కానీ యానిమల్ తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ కూడా సూపర్ అనిపించుకున్నాయి. సినిమా కూడా అదే రేంజ్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
We’re now on WhatsApp : Click to Join