Samantha: ‘యశోద’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగారు.
- By Balu J Published Date - 05:08 PM, Tue - 5 April 22
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “యశోద’లో సమంత నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లలో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్తో ఆకట్టుకుంటారు. ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది.
హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ఈ రోజు కొడైకెనాల్ లో తాజా షెడ్యూల్ ప్రారంభించాం” అని చెప్పారు. సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి – హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.
Related News
Kiara Advani : యష్ టాక్సిక్ లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. అమ్మడి ఖాతాలో మరో లక్కీ ప్రాజెక్ట్..!
Kiara Advani బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్స్ కు చెక్ పెడుతూ ఒకదానికి మించి మరొక చాన్స్ అందుకుంటూ వస్తుంది అందాల భామ కియరా అద్వాని.