Samantha@1: బాలీవుడ్ స్టార్స్ కు సమంత షాక్.. ఇండియన్ సెలబ్రిటీలో నెంబర్1
ఇండియన్ సెలబ్రిటీ (ఐఎంబీడీ) ర్యాంకింగ్ లో సమంత బాలీవుడ్ స్టార్స్ కు షాక్ ఇస్తూ టాప్ ప్లేస్ లో నిలిచింది
- By Balu J Published Date - 05:03 PM, Thu - 4 May 23
టాలీవుడ్ వర్సటైల్ హీరోయిన్ సమంత (Samantha) సినిమాల్లోనూ కాదు.. ఫాలోయింగ్ లో నూ దూసుకుపోతోంది. ఇటీవల ఆమె నటించిన శాకుంతలం మూవీ నిరాశపర్చినప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వెంటనే సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా మారిపోయింది. ఆ మధ్య లండన్ ప్రిమియర్ షో లో హాలీవుడ్ హీరోయిన్ లా కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఇండియన్ సెలబ్రిటీ (ఐఎంబీడీ) ర్యాంకింగ్ లో సమంత బాలీవుడ్ స్టార్స్ కు షాక్ ఇస్తూ టాప్ ప్లేస్ లో నిలిచి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్, బాలీవుడ్ బాద్ షా షారుక్ కూడా సమంత తర్వాత జాబితాలో నిలిచారంటే సమంత క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు.. ఇటీవల నిర్వహించిన మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టులోనూ సమంతనే టాప్ ప్లేస్ (Top Place) ను దక్కించుకోవడం విశేషం. పలు టాలీవుడ్ సినిమాలతో మెప్పించిన పుష్ప (Pushpa) లో ప్రత్యేకంగా చేసిన ఐటెం సాంగ్ బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తీసుకొచ్చేలా చేసింది. శాంకుతలం తర్వాత ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమాలో నటిస్తోంది.
ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ తెరకెక్కించిన `సిటాడెల్`(Citadel)కు ఇండియన్ వెర్షన్ గా దీనిని రూపొందిస్తున్నారు. ఇండియన్ వెర్షన్లో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ముంబై (Mumbai)లో జరుగుతోంది. సమంతపై హై ఓల్టేజ్ యాక్షన్ (Action) సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ లో బాగా అలసిపోయి సమంత ఒళ్లు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుందట. ఇక ఆ బాధ తట్టుకోలేక సమంత షూటింగ్ పూర్తైన వెంటనే రికవరీ కావడానికి ఐస్ బాత్ చేస్తుంది. వర్క్ పట్ల సమంతకు ఉన్న డెడికేషన్ కు ఫిదా అవుతున్నారు.
Also Read: Mehreen Looks: బక్కచిక్కిపోయిన మెహ్రీన్.. లేటెస్ట్ లుక్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్స్
Related News
Samantha : సమంత బంగారం సంథింగ్ స్పెషల్..!
Samantha కెరీర్ లో ఏ కారణాలతో వెనకపడ్డా కూడా రెట్టింపు ఉత్సాహంతో కం బ్యాక్ ఇస్తుంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. ఆమె చేసే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా