Samantha : హమ్మయ్య మళ్ళీ సినిమాలు మొదలుపెట్టిన సమంత.. బర్త్ డే రోజు రీ ఎంట్రీ సినిమా అనౌన్స్..
నేడు సమంత పుట్టిన రోజు కావడంతో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సమంత నెక్స్ట్ సినిమాను నేడు ప్రకటించింది.
- Author : News Desk
Date : 28-04-2024 - 6:53 IST
Published By : Hashtagu Telugu Desk
Samantha : సమంత మాయోసైటిస్ తో బాధపడుతున్నాను అంటూ కొన్నాళ్ల క్రితం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి మాయోసైటిస్ కి చికిత్స తీసుకుంటూ వరల్డ్ టూర్స్ వేసింది. ఇక ప్రస్తుతం హెల్త్ మీద ఫోకస్ చేస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ, ఈవెంట్స్ లో పాల్గొంటూ, పాడ్ కాస్ట్ లు చేస్తూ ప్రేక్షకులకు మళ్ళీ దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది సామ్.
సమంత సినిమాలేమి ఒప్పుకోకపోవడంతో ఇన్నాళ్లు అభిమానులు బాధపడ్డారు. నేడు సమంత పుట్టిన రోజు కావడంతో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సమంత నెక్స్ట్ సినిమాను నేడు ప్రకటించింది. గతంలో సమంత త్రాలల మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు తీస్తానని ప్రకటించింది.
తాజాగా తన రీ ఎంట్రీ సినిమా తన నిర్మాణ సంస్థనుంచే ప్రకటించింది. ‘మా ఇంటి బంగారం'(Maa Inti Bangaram) అనే ఆసక్తికర టైటిల్ తో తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో సమంత చీరకట్టి తాళిబొట్టుతో చేతిలో తుపాకీ పట్టుకొని ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. సమంత మా ఇంటి బంగారం అంటూ అభిమానులు పోస్టర్ ని షేర్ చేస్తూ రీ ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్