Pushpa: పుష్పలో స్పెషల్ సాంగ్.. సమంతకు భారీ రెమ్యునరేషన్!
- By Balu J Published Date - 12:16 PM, Tue - 16 November 21
టాలీవుడ్ హీరోయిన్ సమంత సుక్కు, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పుష్ప మేకర్స్ ప్రత్యేక పాట కోసం సమంతతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. సమంత కూడా ఓకే అనడంతో నవంబర్ 25 నుంచి నవంబర్ 30 షూట్ మొదలుకానుంది. ఇప్పటికే ఈ పాట కోసం హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ కూడా వేసారట.
పుష్ప సినిమా మొత్తానికి ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుండటం, బన్నీతో సమంత స్టెప్పులు వేస్తుండటంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. అయితే హీరోయిన్ సమంత ప్రత్యేక పాటలో నటించినందుకుగానూ బాగానే డిమాండ్ చేస్తోంది. రూ.1.5 కోట్లు ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే సమంత పుష్పరాజ్ తో స్టెప్పులు వేయడానికి రెడీ అవుతోంది. పుష్ప: ది రైజ్, డిసెంబర్ 17 న బహుళ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది. పుష్పలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ధనంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్, హరీష్ ఉత్తమన్ ఈ చిత్రంలో సహాయక పాత్రలు పోషించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Related News
Samantha : అతనికి బర్త్ డే విష్ చేసి ఐలవ్యూ చెప్పిన సమంత..!
Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏ చిన్న న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. ఎందుకో మీడియాకు ఆమె మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది.