Ramcharan and Salman Khan: సల్లూభాయ్ రాబోయే సినిమాలో రాంచరణ్!!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు సంబంధించి కండల వీరుడు సల్లూభాయ్ కీలక ప్రకటన చేశారు.
- Author : Hashtag U
Date : 03-10-2022 - 12:09 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు సంబంధించి కండల వీరుడు సల్లూభాయ్ కీలక ప్రకటన చేశారు. తన కొత్త సినిమా ” కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ “లో రాంచరణ్ కూడా భాగం కాబోతున్నాడని వెల్లడించారు. “నా రాబోయే మూవీలో నటిస్తానని
చరణ్ చెప్పినప్పుడు అదొక జోక్ అనుకున్నా. కానీ తర్వాతి రోజే రాంచరణ్ క్యారవాన్‌లో సినిమా షూటింగ్ కోసం వచ్చేశాడు. రాంచరణ్ నా సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది” అని
సల్లూభాయ్ చెప్పుకొచ్చాడు. సల్లూభాయ్ ప్రస్తుతం చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న గాడ్ ఫాదర్ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల అనంతపురంలో జరిగిన ” గాడ్ ఫాదర్” ప్రమోషనల్ ఈవెంట్‌లో సల్లూ భాయ్ ఈ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రాంచరణ్ తో పాటు హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రల్లో ” కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ “లో నటిస్తున్నట్లు చెప్పారు.
” జనాలు హాలీవుడ్‌కు వెళ్లాలని అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం సౌత్‌కు వెళ్లాలను కుంటున్నాను” అని సల్లూ
ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. సాజిద్ నదియావాలా కథను అందిస్తున్న “కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్” మూవీని ఫర్హద్ సామ్‌జీ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజాహెగ్డే, జగపతిబాబు కీ రోల్స్ చేస్తున్నారు. మరోవైపు రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్‌సీ 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.