SDT 17 : సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా అనౌన్స్.. గాంజా శంకర్..
సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో SDT17 సినిమా అనౌన్స్ చేశారు.
- Author : News Desk
Date : 15-10-2023 - 9:28 IST
Published By : Hashtagu Telugu Desk
సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వచ్చి విరూపాక్ష, బ్రో సినిమాలతో భారీ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత SDT16 సినిమా అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు. తాజాగా SDT17 సినిమా అనౌన్స్ చేశారు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ 17వ సినిమా టైటిల్ ‘గాంజా శంకర్’ అని ప్రకటించారు. రిలీజ్ చేసిన గ్లింప్స్ లో సాయి ధరమ్ తేజ్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ లా, గంజాయి అమ్మేవాడు అన్నట్టు చూపించారు. ఇక ఈ సినిమా ఫుల్ మాస్ సినిమాగా ఉండబోతున్నట్టు తెలిపారు.
మరి తేజ్ గాంజా శంకర్ తో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.