Sai Dharam Tej : మీ అభిమానం నాకు భయం కలిగిస్తుంది.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ లెటర్..
ప్రస్తుతం తేజ్ బ్రో సినిమా సక్సెస్ టూర్స్ లో ఉన్నాడు. ఈ టూర్స్ లో భాగంగా ఏపీలోని పలు ఊర్లు తిరుగుతూ అభిమానులని కలుస్తున్నాడు.
- Author : News Desk
Date : 04-08-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej )యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష(Virupaksha), బ్రో(Bro) సినిమాలతో వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. అయితే యాక్సిడెంట్ తర్వాత నుంచి అతని స్పీచ్ లలో చాలా తేడా వచ్చింది. హెల్మెట్(Helmet) ఉండటం వల్ల కూడా తేజ్ అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. దీంతో ఇప్పటికే పలు ఈవెంట్స్ లో తేజ్ హెల్మెట్ పెట్టుకోండి బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు అని చెప్పాడు.
ప్రస్తుతం తేజ్ బ్రో సినిమా సక్సెస్ టూర్స్ లో ఉన్నాడు. ఈ టూర్స్ లో భాగంగా ఏపీలోని పలు ఊర్లు తిరుగుతూ అభిమానులని కలుస్తున్నాడు. అక్కడ అభిమానులు బైక్స్ మీద ర్యాలీలు చేస్తూ, హడావిడి చేస్తూ హెల్మెట్స్ పెట్టుకోకుండా తిరుగుతుండటంతో ఒక ఎమోషనల్ లెటర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తేజ్.
సాయి ధరమ్ తేజ్ తన లెటర్ లో.. అందరికి నమస్కారం.. బ్రో విజయ యాత్రలో భాగంగా నాపై మీరు చూపించే అభిమానానికి చాలా థ్యాంక్స్. అందరిని కలుసుకోవడం, మీ ప్రేమ పొందడం, సినిమా గురించి మీ నుంచి వినడం చాలా బావుంది. నన్ను కలవడానికి వచ్చేవారు సెల్ఫీలు, ఫోటోలు అంటూ ఆప్యాయంగా దగ్గరికి వస్తున్నారు. వీలైనంతవరకు నేను మీకు అందుబాటులో ఉండటానికే ప్రయత్నిస్తున్నాను. అయితే ఈ క్రమంలో చాలామంది హెల్మెట్ ధరించకుండా బైకుల మీద ఫాలో చేయడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీయడం వంటివి చేస్తున్నారు. ఈ విషయంలో నాకు ఎంతో భయాన్ని కలుగచేస్తుంది. మీ అభిమానంతో ఇలా చేస్తున్నప్పటికీ ఆ క్రమంలో మీకు ఎటువంటు హాని జరిగినా నాకు తీవ్ర మనస్థాపన కలిగిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అభిమానుల్లా కన్నా ‘బ్రో’స్ లా భావిస్తాను. మీ భద్రతా నా బాధ్యత. దయచేసి మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మరిచిపోకండి. నాకు మీ మీద ప్రేమని పొందుతూ ఉండే అవకాశాన్ని ఇవ్వండి. అర్ధం చేసుకోగలరు అని భావిస్తున్నాను అని తెలిపాడు. దీంతో ఈ లెటర్ వైరల్ గా మారింది.
Grateful for your love & kindness. Thank you! 🙏🏼#BroTheAvatar #BroVijayaYatra pic.twitter.com/ntpjS3Pg27
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 4, 2023