Rukshar Dhillon : నేను కంఫర్ట్‌గా లేను..ప్లీజ్ ఆలా చేయొద్దు
Rukshar Dhillon : ”తన అసౌకర్యాన్ని పట్టించుకోకుండా కొందరు జర్నలిస్ట్‌లు ఫోటోలు తీస్తూనే ఉన్నారని విమర్శించింది. నేను కంఫర్ట్‌గా లేనని చెప్పినా కూడా ఫోటోలు తీస్తారా? అంటూ జర్నలిస్ట్‌లను ప్రశ్నించింది
- By Sudheer Published Date - 02:26 PM, Fri - 7 March 25

Rukshar Dhillon : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. కన్నడ చిత్ర “రన్ ఆంటోని” ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ తెలుగులో “ఆకతాయి” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని సాధించకపోయినా, నాని నటించిన “కృష్ణార్జున యుద్ధం” సినిమాలో కథానాయికగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆ తరువాత “ఏబీసీడీ”, “అశోక వనంలో అర్జున కళ్యాణం” వంటి చిత్రాల్లో నటించి తన టాలెంట్‌ను నిరూపించుకుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న “దిల్ రూబా” (Dil Ruba) సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.
Indira Mahila Shakti: రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల
ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గా మీడియా పై అసహనం వ్యక్తం చేసింది. ”తన అసౌకర్యాన్ని పట్టించుకోకుండా కొందరు జర్నలిస్ట్‌లు ఫోటోలు తీస్తూనే ఉన్నారని విమర్శించింది. నేను కంఫర్ట్‌గా లేనని చెప్పినా కూడా ఫోటోలు తీస్తారా? అంటూ జర్నలిస్ట్‌లను ప్రశ్నించింది. ప్రేమతో కూడా చెప్పాను ఫొటోలు తీయవద్దు నేను కంఫర్ట్‌గా లేనని అయిన కూడా వినట్లేదు. నేను పేర్లు చెప్పలేను కానీ ఇంకోసారి ఇలా చేయకండంటూ” హెచ్చరించింది. సాధారణంగా ఈవెంట్లలో తమ వ్యక్తిగత స్థాయిలో కలిగే అసౌకర్యాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. టాలీవుడ్‌లో ఇలాంటి ఘటనలు చాలాసార్లు జరిగినా, ఇప్పటికీ మార్పు రావడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో మహిళలకు మరింత గౌరవం దక్కాలని, వారి అభిప్రాయాలను గౌరవించాలని ఈ ఘటన ద్వారా మరోసారి చర్చ మొదలైంది.