RRR:ఆర్ఆర్ఆర్ ట్రైలర్, మూవీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన రాజమౌళి
2022ను సినిమా నామ సంవత్సరంగా పిలవొచ్చేమో. చిరంజీవి, రాంచరణ్ ఇద్దరు నటించిన ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్, మహేష్ బాబు సర్కారు వారిపాట, రాంచరణ్ ఎన్టీఆర్ నటిస్తున్న ట్రిబుల్ ఆర్, పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ లాంటి భారీ సినిమాలన్నీ 2022లోనే రిలీజ్ అవ్వనున్నాయి.
- Author : Siddartha Kallepelly
Date : 04-12-2021 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
2022ను సినిమా నామ సంవత్సరంగా పిలవొచ్చేమో. చిరంజీవి, రాంచరణ్ ఇద్దరు నటించిన ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్, మహేష్ బాబు సర్కారు వారిపాట, రాంచరణ్ ఎన్టీఆర్ నటిస్తున్న ట్రిబుల్ ఆర్, పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ లాంటి భారీ సినిమాలన్నీ 2022లోనే రిలీజ్ అవ్వనున్నాయి.
పై సినిమాలకు సంబందించిన రిలీజ్ డేట్ పై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రానున్న రాజమౌళి సినిమా ఆర్‌ఆర్‌ఆర్ 2022 జనవరి 7న విడుదల కానుంది. భారీ అంచనాలు కల్గిన ఈ సినిమా టీమ్ ఇప్పడు పొస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల కావల్సి ఉండగా పలు కారణాలతో వల్ల వాయిదా పడింది. దీన్ని మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఫాన్స్ ఎదురుచూస్తుండగా ఈ సినిమా దర్శకుడు రాజమౌళి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు రాజమౌళి ట్వీట్ చేశారు.
చారిత్రిక, కొన్ని వాస్తవిక అంశాలతో తీయనున్న ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడే పలు విమర్శలను ఎదుర్కొంది. ఇక సినిమా విడుదలయ్యాక ఎన్ని కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుద్దో చూడాలి.
DECEMBER 9th… #RRRTrailer… #RRRTrailerOnDec9th #RRRMovie pic.twitter.com/aTivcMbA02
— rajamouli ss (@ssrajamouli) December 4, 2021