‘RRR’ Records: రిలీజ్ కు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల వేట
దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
- By Balu J Published Date - 03:19 PM, Sun - 20 March 22

దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చరణ్, తారక్ ల స్నేహబంధాన్ని వెండితెరపై చూసేందుకు మెగా, నందమూరి అభిమానులు ఎన్నో రోజులుగా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను ఒకే స్క్రీన్ పై ఫ్రెండ్స్ గా చూపించబోతున్నారు దర్శకుడు జక్కన్న. ఇందులో చరణ్ అల్లూరి సీతారామారాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తో పాటు హీరోయిన్ లుగా అలియా భట్, శ్రియా సరన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరుగడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగం చేసింది జక్కన్న అండ్ టీమ్. ఈ క్రమంలో ‘RRR’ సినిమా రిలీజ్ కు ముందే రికార్డుల వేట ప్రారంభించింది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఓవర్ సీస్ మార్కెట్ లో విడుదలకు ముందే… ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఇప్పటికే రెండు మిలియన్స్ క్రాస్ చేసిందట. దాదాపు మూడు మిలియన్ డాలర్స్‌కు చేరువలో ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక విడుదల సమయానికి మూడు మిలియన్స్ క్రాస్ చేయడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషులు. అంటే… కేవలం ప్రీమియర్స్ పరంగానే… ‘RRR’ సినిమా ఇప్పటికే రూ. 20 కోట్లు వసూళ్లను రాబట్టినట్టుగా తెలుస్తోంది.
విడుదలకు ముందే ‘ఆర్ఆర్ఆర్’ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఈ స్థాయిలో రాబట్టడం మొదటి రికార్డ్. ఇలా ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ మూవీ కూడా ‘ఆర్ఆర్ఆర్’ కావడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా… పాత రికార్డులన్నింటినీ చిలిపి వేయడం పక్కా అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి విడుదలకు ముందే ఎన్నో రికార్డులను షురూ చేసిన ‘RRR’ సినిమా… రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.