Resul Pookutty On RRR: ఆర్ఆర్ఆర్ ‘గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్స్ వైరల్!
ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి పరిచయం అక్కర్లేని పేరు.
- By Balu J Published Date - 02:09 PM, Mon - 4 July 22
ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి పరిచయం అక్కర్లేని పేరు. ఈయన ఎన్నో ఇండియన్ మూవీస్ కు పనిచేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీ అందర్నీ ఆకట్టకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీపై రెసూల్ షాకింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ ఓ ‘గే లవ్ స్టోరీ’ అని కామెంట్ చేశారు. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో అలియా భట్‌ను ‘ఆసరా’గా ఉపయోగించారని అన్నారు. రెసూల్ వ్యాఖ్యలపై అభిమానులు కోపంగా రియాక్ట్ అయ్యారు. అలాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమని అన్నారు.
RRR అనేది 1920ల పూర్వ స్వతంత్ర యుగంలో జరిగిన కల్పిత కథ. ఇద్దరు నిజ జీవిత విప్లవకారుల జీవితాల ఆధారంగా రూపొందించబడింది. అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్, వరుసగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ తమ పాత్రలను పోషించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కొంతమందిని ఆకట్టుకోలేకోవడంలో విఫలమైంది.
ఆదివారం, నటుడు-రచయిత మునీష్ భరద్వాజ్ ఒక ట్వీట్లో RRRని ‘చెత్త’ అని కామెంట్ చేశాడు. అతని ట్వీట్‌పై రెసూల్ స్పందించి “గే లవ్ స్టోరీ” అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ కావడంతో అభిమానులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆస్కార్ స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేస్తారని అనుకోలేదని అన్నారు. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరురావడంతో అవన్నీ జీర్ణించుకోలేక ఇలా కామెంట్స్ చేస్తున్నారని ఫ్యాన్స్ గట్టిగా సమాధానమిచ్చారు. భాషతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ గౌరవించాలని సూచించారు. గతంలో రాంగోపాల్ వర్మతో పాటు మరికొంతమంది ఇది LGBTQ మూవీ అని కామెంట్స్ చేశారు.
Gay love story ….
— resul pookutty (@resulp) July 3, 2022
Related News
RRR Movie: ఆర్ఆర్ఆర్ కు రెండేళ్లు.. త్రిబుల్ ఆర్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతే కాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగ