Raviteja Eagle : ఈగల్ అసలు మ్యాటర్ దాచిపెట్టారా.. రవితేజ మాస్టర్ స్కెచ్ వర్క్ అవుట్ అవుతుందా..?
Raviteja Eagle మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఈగల్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించారు.
- Author : Ramesh
Date : 05-02-2024 - 12:39 IST
Published By : Hashtagu Telugu Desk
Raviteja Eagle మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఈగల్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాలో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ నటించారు. సినిమాకు దేవ్ జాండ్ మ్యూజిక్ అందించారు. సినిమాటోగ్రాఫర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కార్తీక్ డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఈగల్.
We’re now on WhatsApp : Click to Join
ఆల్రెడీ అతని మొదటి డైరెక్టోరియల్ సినిమా సూర్య వర్సెస్ సూర్య మంచి రిజల్ట్ అందుకుంది. ఆ తర్వాత చాలా ఏళ్లు గ్యాప్ ఇచ్చి మరోసారి ఈగల్ ని డైరెక్ట్ చేశాడు కార్తీక్. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తే రవితేజ మార్క్ యాక్షన్ మూవీ అనే తెలిస్తుంది కానీ కథ ఏంటన్నది మాత్రం అంతగా చెప్పలేదు. కథ దాచిపెట్టి సినిమాకు వచ్చిన ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని మాస్టర్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ కార్తీక్.
ఈ సినిమాలో ఈగల్ పత్తి రైతుల కోసం పోరాడుతాడట. అదే మెయిన్ ఫ్లాట్ కాగా దాన్ని మరీ మెసేజ్ ఇచ్చినట్టు కాకుండా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దారని తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ మేనరిజం యాక్షన్ అంతా మాస్ రాజా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందిస్తుందని తెలుస్తుంది.
ఏది ఏమైనా సినిమా ట్రైలర్ లో కథ చెప్పకుండా రవితేజ అండ్ కార్తీక్ ఇద్దరు ఆడియన్స్ కి మెగా షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న ఈగల్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా విషయంలో మాస రాజా ఫ్యాన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
Also Read : Trisha : విశ్వంభర సెట్ లోకి త్రిష.. హమ్మయ్య గ్లామర్ విషయంలో డోకా లేదన్నట్టే..!