HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Ravi Teja Sudheer Varma Abhishek Namas Ravanasura Rule Begins On Sets

Ravi Teja: ‘రావణాసుర’ రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న `రావణాసుర` సినిమాను సంక్రాంతి ప‌ర్వ‌దినం రోజున మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ఇతర అతిథుల‌ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

  • By Balu J Published Date - 12:43 PM, Wed - 19 January 22
  • daily-hunt
Raviteja
Raviteja

మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న `రావణాసుర` సినిమాను సంక్రాంతి ప‌ర్వ‌దినం రోజున మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ఇతర అతిథుల‌ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక నుండి `రావణాసుర`పాలన ఆరంభం కానుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం కీల‌క తారాగ‌ణంపై  నైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతోన్నారు. రామ్ పాత్రలో సుశాంత్ ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదు పాత్రల‌కు కూడా మంచి ప్రాముఖ్యత ఉండ‌నుంది.

రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. పోస్టర్‌ను బట్టే మనకు ఆ విషయం అర్థమవుతోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నటీనటులు : రవితేజ, సుశాంత్, అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్,  మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహత (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు

సాంకేతిక బృందం

డైరెక్టర్: సుధీర్ వర్మ
నిర్మాత: అభిషేక్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్:  శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్: హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్
డీఓపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: శ్రీకాంత్
ప్రొడక్షన్ డిజైనర్: డీఆర్‌కే కిరణ్
సీఈఓ:  పోతిని వాసు
మేకప్ చీఫ్:  ఐ శ్రీనివాస్ రాజు
పీఆర్వో : వంశీ-శేఖర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ravanasura
  • Ravi teja
  • regular
  • shooting

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd