Rashmika Forbes : ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న రష్మిక
- Author : Sudheer
Date : 15-02-2024 - 8:04 IST
Published By : Hashtagu Telugu Desk
యానిమల్ (Animal) మూవీ తో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారిన రష్మిక (Rashmika )..తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. కన్నడ మూవీ తో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక..తెలుగు లో గీత గోవిందం మూవీ ఆమెను యూత్ కు దగ్గర చేసింది. ఆ మూవీ తర్వాత వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. పుష్ప , యానిమల్ మూవీస్ అమ్మడిని ఎక్కడికో తీసుకెళ్లాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న రష్మిక..తాజాగా ఫోర్బ్స్ జాబితాలో
(Forbes )చోటు దక్కించుకుంది.
ఈ సంస్థ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన 30ఏళ్లలోపు వ్యక్తులతో ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ (Forbes India 30 Under 30 Class of 2024) జాబితాను రూపొందించింది. ఇందులో రష్మిక టాప్ ప్లేస్లో నిలిచి ఆశ్చర్య పరిచింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా పంచుకుని, ఫోర్బ్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే…పుష్ప2 : ది రూల్ లో నటిస్తుంది. ఈ మూవీ ఆగస్టు 15 న విడుదల కానుంది. VD12 – విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తుంది. D51 – ధనుష్ & శేఖర్ కమ్ముల సినిమాలో , రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా లో, రెయిన్‌బో – లేడీ ఓరియెంటెడ్ మూవీలో , ఇక లేటెస్ట్‌గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉంది.
ఇక నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా ట్విట్టర్లో లో నెటిజన్లు వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? అని అడిగి సంతోష పెట్టింది. ఈ ప్రశ్నకు చాలామంది ఫాలోయర్స్ స్పందించారు. ఇక రష్మికను సైతం వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? అని రివర్స్‌లో ప్రశ్నించారు. దానికి రష్మిక కూడా ఫన్నీగా రిప్లైలు ఇస్తూ వచ్చింది.
Read Also : KK Senthil Kumar : ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి మృతి