EXCLUSIVE: విజయ్ కోసం యూఎస్ వెళ్లిన రష్మిక.. ఇదిగో ఫ్రూఫ్!
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ లో హిట్ పెయిర్ గా గుర్తింపు ఉంది. వీళిద్దరు కలిసి నటించిన ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి.
- By Balu J Published Date - 12:41 PM, Wed - 24 November 21

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ లో హిట్ పెయిర్ గా గుర్తింపు ఉంది. వీళిద్దరు కలిసి నటించిన ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. గీతగోవిందం మూవీలో చాలా నేచురల్ గా నటించి బెస్ట్ ఫెయిర్ అనిపించుకున్నారు. అయితే ఈ జంట సినిమాల్లోనే కాకుండా.. బయట కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది. విజయ్ దేవరకొండ తో ఉన్న సానిహిత్యంతో హీరోయిన్ రష్మిక తరుచుగా కలుస్తుంటుంది. పలుసార్లు హైదరాబాద్ లో విజయ్ ఇంటికి వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయి.
తాజాగా రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ‘దూరంగా వెళుతున్నాను’ అంటూ తన పాస్‌పోర్ట్ ఫోటోను షేర్ చేసింది. లైగర్ షూటింగ్‌లో ఉన్న విజయ్ దేవరకొండను కలుసుకునేందుకు USA వెళుతుంది. తన పాస్‌పోర్ట్ చిత్రాన్ని షేర్ చేస్తూ, “ఈసారి మీకు చాలా దూరంగా ఉన్నా. కానీ త్వరలో తిరిగి వస్తాను” అని రాసింది. వెంటనే, ఆమె విమానం నుంచి మరొక సెల్ఫీని పోస్ట్ చేసింది. ఎక్కడికి వెళుతుందో ఊహించమని అభిమానులను కోరింది. లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నప్పుడు రష్మిక విజయ్‌తో కలిసి రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా, లైగర్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు రష్మిక గోవాకు వెళ్ళింది.
Related News

Rashmika : రష్మికకు యాక్టింగ్ రాదు.. నేషనల్ క్రష్ పై KRK కామెంట్స్..!
Rashmika స్వయం ప్రకటిత విమర్శకుడు కె.ఆర్.కె కమల్ ఆర్ ఖాన్ ఎప్పుడు ఏదో ఒక సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తాడు.