Rana’s wife Mihika : బీచ్ లో చిల్ అవుతున్న రానా వైఫ్
Rana's wife Mihika : సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మిహీక . ఓ బీచ్‌లో డాగ్స్‌తో సరదాగా నడుస్తూ కనిపించింది. అందమైన పూల చెట్ల మధ్య రిలాక్స్ అవుతూ ఆమె ప్రఫుల్ యానిమేషన్‌ను పంచుకుంది
- By Sudheer Published Date - 12:02 PM, Sun - 27 October 24

రానా వైఫ్ మిహీక (Rana’s wife Mihika) ..బీచ్ (Beach) లో చిల్ అవుతూ..ఆ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేసి ఆకట్టుకుంది. 2020లో రానా.. మిహీక ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో అతికొద్ది కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగింది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మిహీక . ఓ బీచ్‌లో డాగ్స్‌తో సరదాగా నడుస్తూ కనిపించింది. అందమైన పూల చెట్ల మధ్య రిలాక్స్ అవుతూ ఆమె ప్రఫుల్ యానిమేషన్‌ను పంచుకుంది. వీడియో కింద మిహీక ఒక కాప్షన్ జోడించి, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు అనుభవాలను వర్ణించారు.
“మెత్తటి ఇసుక నా పాదాలకు ఊయలగా ఉంది, గాలి నా జుట్టులో నాట్యం చేస్తుంది, అంతులేని సముద్రం నా ముందు ఉంది. పైన ఉన్న ఒక అద్భుతమైన నక్షత్రం నా కోసమే ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తుంది. దూరంగా కుటీర లైట్లు తుమ్మెదల్లా మెరుస్తున్నాయి. రాత్రి జారిపోతున్నప్పుడు, ఉదయం వెచ్చటి బ్లష్ లా చంద్రుని చల్లని లాలన మసకబారుతుంది. వెండి చంద్రుడు బంగారు సూర్యుడికి నమస్కరిస్తాడు, అడవి గాలులు వారి సందేశాన్ని గుసగుసలాడుతూ సున్నితమైన గాలిలో ఉంచేస్తాయి.” ఈ పోస్ట్ ప్రస్తుతానికి వైరల్ అవుతూ, మిహీక అందమైన అనుభవాలను పంచుకుంటున్నందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక రానా విషయానికి వస్తే.. “లీడర్” సినిమాతో తన సినీ కెరియర్ ప్రారంభించారు. మొదటి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకున్న రానా..బాహుబలి తో పవర్ ఫుల్ విలన్ గా పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యారు. తెలుగు , హిందీ , తమిళ్ వంటి భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు.
Read Also : Renu desai : రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలిపిన రేణుదేశాయ్