HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Rana Daggubati Exclusive Interview About Virataparvam

Rana Exclusive: ఆ పాత్ర సాయిపల్లవి తప్పితే మరొకరు చేయలేరు!

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'.

  • By Balu J Published Date - 12:54 PM, Sun - 12 June 22
  • daily-hunt
Rana Bheemla Nayak
Rana Bheemla Nayak

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో హీరో రానా మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న విరాటపర్వం విశేషాలివి.

అరణ్య నుండి విరాటపర్వంలోకి రావడం ఎలా అనిపించింది ?

అడవులకూ నాకూ ఏదో అనుబంధం ఉన్నట్లుంది.(నవ్వుతూ) గత నాలుగేళ్ళుగా అడవుల్లోనే ఎక్కువ షూటింగులు జరిగాయి. అక్కడే ఎక్కువ గడిపాను. విరాట పర్వానికి వచ్చేసరికి 90లో జరిగే కథ. దళం సభ్యులు అడవుల్లో వుండే రోజులు.,నాటి వాతావరణం.. చాలా యదార్ధంగా తీశాం. నా కెరీర్ లో ఫస్ట్ టైం ఒక గ్రేట్ లవ్ స్టొరీ చేశాను. చాలా లోతైన ప్రేమకథ. ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్తాడు, ఎంత త్యాగం చేస్తాడు ? స్క్రిప్ట్ చదివినప్పుడే చాలా డీప్ గా అనిపించింది. కథ చదివినప్పుడు చాలా బరువనిపించింది. ఒక లోతైన సముద్రంలో తోసేస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో విరాటపర్వం కథ చదివినప్పుడు అలాంటి డీప్ ఫీలింగ్ కలిగింది. విరాటపర్వం లాంటి కథ ఎప్పుడూ వినలేదు, అంత భారం ఎప్పుడు తీసుకోలేదు.

ఒక ఉద్యమ నేపధ్యమున్న రవన్న జీవితంలోకి ప్రేమ ఎలా ప్రవేశిస్తుంది ?

ఇప్పుడే కథ మొత్తం చెప్పెలేం కదా (నవ్వుతూ) రవన్న కానీ దళం సభ్యులు కానీ మరో ఉద్యమ నాయకులు కానీ ఖచ్చితమైన లక్ష్యంతో వుంటారు. కుటుంబ, స్నేహ సంబంధాలు కన్నా సమాజమే ముఖ్యమని జీవిస్తారు. ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా వెళ్తున్న రవన్న జీవితంలోకి వెన్నెల ప్రవేశిస్తుంది. ఇక్కడే ఒక మోరల్ డైలమా వుంటుంది. ఒక లక్ష్యం కోసం పని చేయాలా ? ఫ్యామిలీతో కలసి రిలాక్స్ అవ్వాలా? అనేది ఒక మోరల్ డైలమా.ఈ సినిమా మోరల్ డైలమా గురించి వుంటుంది.

ఈ సినిమా చేసిన తర్వాత నక్సల్స్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది ?

టైం ని రీక్రియేట్ చేయడం సినిమా వలనే సాధ్యం. నక్సల్ మూమెంట్ గురించి టీవీల్లో, న్యూస్ పేపర్స్ లోవచ్చిన కొన్ని హైలెట్స్ మాత్రమే తెలుసు. కానీ వాళ్ళు రియల్ గా ఎలా వుంటారు ? యూనివర్షిటీలో చదువుకున్న విద్యార్ధులు కూడా నక్సల్స్ గా ఎందుకు మారారు ? ఇలాంటి వివరాల్లోకి వెళ్ళలేదు. రవన్న కథలో మాటల రూపంలో ఇలాంటి వివరాలు కొన్ని తెలుస్తాయి. కొన్ని సంఘటనలు, పొలిటికల్ డ్రామా నడుస్తుంటుంది. కానీ ఈ కథలో ప్రధాన సారాంశం మాత్రం ప్రేమ.

రవన్న పాత్రకు స్ఫూర్తి ఉందా ?

రవన్న పాత్ర యదార్ధ పాత్ర కాదు. మేము డిజైన్ చేశాం. చేగువేరా లాంటి నాయకులు స్ఫూర్తి రవన్న పాత్రలో కనిపిస్తుంది. రవన్న ఒక డాక్టర్. కానీ అప్పుడున్న పరిస్థితులు రవన్నని కవిగా తర్వాత ఉద్యమ నాయకుడిగా మారుస్తాయి.

విరాటపర్వం టైటిల్ జస్టిఫీకేషన్ ఏంటి ?

మహా భారతంలో విరాటపర్వం అనేది అజ్ఞాతవాసానికి సంబంధించిన కథ. విరాట పర్వంలో కూడా ఇలాంటి అజ్ఞాతపోరాటం వుంటుంది.

ఒక నక్సల్ గా అదే సమయంలో ప్రేమికుడిగా కనిపిస్తున్నారు కదా .. ఆ రెండు పాత్రలని ఎలా బ్యాలన్స్ చేస్తున్నారు ?

సరదాగా పాటలు పాడుకునే ప్రేమ కాదిది. రవన్న పాత్ర చాలా ఇంటెన్స్ గా వుంటుంది. బలమైన ఎమోషన్స్ వుంటాయి. ఇందాక చెప్పినట్లు సినిమా అంతా మోరల్ డైలమా వుంటుంది.

మీకు పాన్ ఇండియా రీచ్ వుంది కదా .. విరాటపర్వం పాన్ ఇండియా ప్లాన్ చేయకపోవడానికి కారణం?

ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు కానీ నేను పదేళ్ళుగా ఆ పాన్ లోనే ఆమ్లెట్లు వేసుకుంటున్నాను(నవ్వుతూ). కొన్ని కథలు తెలుగులోనే చేయాలి. విరాట పర్వం మొదలు పెట్టినప్పుడే మాకు పాన్ ఇండియా ఆలోచన లేదు. ఇది ఒక ప్రాంతానికి సంబధించిన కథ. ఆ ప్రాంతం తాలూకు సాహిత్యం ఎక్కువగా వుంది. దర్శకుడు వేణు ఉడుగుల స్వతహాగా సాహిత్యకారుడు. ఈ సాహిత్యం మరో భాషలో కుదరక పోవచ్చు. అందుకే పాన్ ఇండియా ఆలోచన పెట్టుకోలేదు. ఐతే మలయాళం, బెంగాళీ, హిందీలో డబ్ చేస్తున్నాం.

సాయి పల్లవితో పాటు జరీనా వాహెబ్, ప్రియమణి, ఈశ్వరి రావు, నందిత దాస్, పాత్రలు కూడా వున్నాయి కదా ..వాళ్ళ ప్రాధన్యత ఎలా వుంటుంది ?

రవన్న, వెన్నెల కాకుండా ఈ సినిమా లో కనిపించే దాదాపు అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంది. ప్రధాన పాత్రలే కాకుండా మిగతా పాత్రలు చెప్పిన డైలాగ్స్, ఆలోచనలతో కూడా కథ వేగంగా ముందుకు వెళుతుంది. ”జరీనా వాహెబ్, ప్రియమణి, ఈశ్వరి రావు, నందిత దాస్.. ఈ పాత్రలన్నీ బలంగా వుంటాయి. ఇది మహిళా చిత్రం. స్క్రీనింగ్ చూసి అబ్బాయిలంతా వావ్ అంటే.. మహిళా ప్రేక్షకులు కంటతడి పెట్టుకొని అద్భుతమని చెబుతున్నారు.

మీ సినిమాలకి చాలా గ్యాప్ వస్తుంది కదా ?

చాలా త్వరగా సినిమాలు చేసేవాడిని. మధ్యలో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. ఐతే నేను వచ్చి షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత పాండమిక్ వచ్చింది. ఇది సెట్ లో తీసే సినిమా కాదు. పరిస్థితులు సర్దుకున్నాక మళ్ళీ అడవిలోనే షూట్ ఫినిష్ చేశాం. విడుదల తేది విషయానికి వస్తే.. మంచి డేట్ కోసం ఎదురుచూశాం. రెండు మూడు వారాలు మనకే వున్నపుడు వస్తే బావుంటుందని అనుకున్నాం. జూన్ 17న వస్తున్నాం. దిని తర్వాత రెండు వారాల వరకూ ఎలాంటి సినిమా లేదు. ప్రేక్షకులంతాహాయిగా విరాటపర్వం ఎంజాయ్ చేయొచ్చు.

రవన్న పాత్రలో వుండే సవాళ్లు ఏంటి ?

చాలా ఇంటెన్సిటీ వున్న పాత్ర. ఇంత బలమైన పోయిట్రీ రాసే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళలో ఎంత డెప్త్ వుంటుంది ..దర్శకుడు వేణు గారు నేను చర్చించుకునేవాళ్ళం.

సాయి పల్లవి గారి గురించి ?

సాయి పల్లవి గొప్ప నటి. విరాట పర్వంలో వెన్నెల పాత్రలో మరో స్థాయిలో వుంటుంది. ఇది వెన్నెల కథని ట్రైలర్ లో చెప్పాం. రవన్న పాత్రని మరొకరు చేస్తారో లేదో తెలీదు కానీ వెన్నెల పాత్రని సాయి పల్లవి తప్పితే మరొకరు చేయలేరు. సాయి పల్లవి చాలా సింపుల్ పర్శన్. ఆ సింప్లీసిటీ వల్లే ఇంత అద్భుతమైన నటన కనుబరుస్తుందని భావిస్తున్నా.

ఇంత సీరియస్ టోన్ లో లైవ్ స్టొరీ కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారా ?

కొన్ని కథలకి కమర్షియల్ టోన్ కావాలి. మరి కొన్ని కథలకు సీరియస్ టోన్ కావాలి. విరాట పర్వం చూసి చప్పట్లు కొడతారో లేదో తెలియదు కానీ .. ఇది నిజమే కదా అని మాత్రం భయపడతారు. అంత నిజాయితీ గల కథ ఇది.

విరాట పర్వం లాంటి కథ ఇప్పుడు రావడం ప్రజంట్ ట్రెండ్ కి సరైనదేనా ?

విరాట పర్వంకి ఇదే సరైన సమయం. మన ప్రపంచాన్ని వదిలేసి వేరే ప్రపంచంలో నాన్ స్టాప్ గా ఉండగలిగితే అదే సినిమా ఎక్స్ పిరియన్స్. విరాట పర్వం అలాంటి ఎక్స్ పిరియన్స్ వున్న సినిమా. సినిమా చాలా కొత్తగా వుంటుంది. ఒక ప్రేమ కథ రిలాక్స్ గా హ్యాపీ గా వెళ్తుంటుంది. కానీ ఇది భయం భయంగా వెళ్తుంది. ఈ వైవిధ్యం చాలా కొత్తగా వుంటుంది.

కెమరా మ్యాన్స్ గురించి చెప్పండి ?

డానీ, దివాకర్ మణి అనే ఇద్దరు డివోపీ గా పని చేశారు. డానీ సినిమాని చాలా కొత్తగా చూపించారు. ట్రైలర్ చూస్తే విజువల్ రిచ్ నెస్ అర్ధమౌతుంది. షాట్స్ చాలా వివరంగా వుంటాయి. దివాకర్ మణి కూడా గ్రేట్ విజువల్స్ ఇచ్చారు

నటుడిగా అద్భుతం అనిపించుకున్నారు.. సోలో హీరోగా కమర్షియల్ సక్సెస్ గురించి ఆలోచిస్తుంటరా ?

నేను హీరో అవ్వాలంటే నేను కొట్టే విలన్ ఎవరో కనిపించలేదు. ఇది మొదటి సమస్య(నవ్వుతూ). ఒక కథని చెప్పాలంటే హీరోగానే ఉండాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనేది నా కోరిక. ఇప్పుడు నా నుండి రాబోతున్న సినిమాలు హీరోయిజం ఉండేవే. చాలా కొత్తగా వుంటాయి.హిరణ్యకశ్యప చేస్తున్నా. దాని కంటే పెద్ద కమర్షియల్ సినిమా వుండదు. నా వరకూ అది కమర్షియల్. కథ సీరియస్ గా జరుగుతున్నపుడు సడన్ గా డ్యాన్స్ వేస్తె నేను బయటికి వెళ్ళిపోతా. ఇవి నాకు ఎక్కవు. అలాగే హీరోయిన్ ని టీజింగ్ చేసిన ఇబ్బందిగా వుంటుంది. ఇలాంటివి నచ్చవు. మనం టెంపరరీ. సినిమాలు శాశ్వతం. చాలా మంది గొప్ప నటులు వదిలేసిన గొప్ప విషయాలనే గుర్తుపెట్టుకుంటాం. అలా గొప్ప గుర్తుపెట్టుకునే వర్క్ చేయాలని వుంది.

మీకు ఏ జోనర్ ఇష్టం ?

అన్ని జోనర్స్ ఇష్టం. అయితే చేసిన జోనర్, పాత్ర మళ్ళీ మళ్ళీ చేయకూడదు.

విరాట పర్వానికి ఒక నిర్మాతగా వున్నారు కదా.. ఫుల్ టైం నిర్మాతగా కొనసాగుతారా ?

నిజాయితీ గల సినిమాలు చేయాలనే ఆలోచన వుంది. బొమ్మలాట, కేరాఫ్ కంచరపాలెం, చార్లీ, ఇప్పుడు విరాట విరాట పర్వంకు నిర్మాతగా నా పేరు కనిపిస్తుంది. అమర చిత్ర కథ కూడా డెవలప్మెంట్ లో వుంది.

రానా నాయుడు గురించి ?

నేను వెంకటేష్ గారు చేసిన వెబ్ సిరిస్. క్రైమ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వుంటుంది.

పాన్ ఇండియా సీన్ లోకి రావడం వలన కథల ఎంపిక కష్టమైయిందా ?

పాన్ ఇండియా అనేది కథే చెప్పాలి. పాన్ ఇండియా సినిమా తీయాలని నిర్ణయించుకునే తీస్తే అది వర్క్ అవుట్ కాకపోవచ్చు. కథే నిర్ణయించాలి.

మీ బ్రదర్ సినిమా ఎక్కడి వరకూ వచ్చింది ?

అది ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇంకా చూడలేదు.

రీసెంట్ గా నచ్చిన సినిమా ?

కమల్ హాసన్ గారి ‘విక్రమ్’ చాలా నచ్చింది.

విరాట పర్వం ప్రివ్యూలు వేశారు కదా.. ఎలాంటి స్పందన వచ్చింది ?

చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన అందరూ వండర్ ఫుల్ అంటున్నారు. విరాటపర్వంలో మొదటిసారి ఓ పాట పాడాను.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • interview
  • Rana Daggubati
  • special
  • virataparvam

Related News

    Latest News

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd