Charan : రామ్ చరణ్..అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాల్సిందే -అయ్యప్ప జేఏసీ
Ram Charan : అయ్యప్ప మాలధారణ సమయంలో భక్తులు కొన్ని ఆచారాలను పాటించాలి, పౌరాణిక నియమాలను ఉల్లంఘించకుండా ఉండాలి. ఈ నియమాలను రామచరణ్ ఉల్లంఘించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి
- By Sudheer Published Date - 02:14 PM, Thu - 21 November 24

సినీ నటుడు రామ్ చరణ్ (Ram Charan) అయ్యప్ప మాలధారణ (Ayyappa Mala)లో ఉండి కడప దర్గా (Kadapa Dargah)ను సందర్శించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. దీనిపై పెద్ద ఎత్తున హిందూ సంఘాలు మరియు అయ్యప్ప స్వాములు వ్యతిరేకిస్తున్నారు. రామ్ చరణ్ చేసింది పెద్ద తప్పని, మాల ధరించి ఉన్న సమయంలో దర్గాకు వెళ్లడం, భక్తుల మనోభావాలకు దెబ్బతీసినట్లే అని జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయ్యప్ప మాలధారణ సమయంలో భక్తులు కొన్ని ఆచారాలను పాటించాలి, పౌరాణిక నియమాలను ఉల్లంఘించకుండా ఉండాలి. ఈ నియమాలను రామచరణ్ ఉల్లంఘించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయ్యప్ప జేఏసీ.. రామ్ చరణ్ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ వెంటనే హిందూ సంఘాలకు , అయ్యప్ప స్వాములకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
జేఏసీ నాయకులు గాంధీ కృష్ణ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ‘అయ్యప్ప మాలధారణలో ఉండి అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మెగా హీరో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి మాల నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాకుండా దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ధర్మాన్ని కాపాడతానంటూ ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం, రామ్ చరణ్ బాబాయి పవన్ కల్యాణ్ శ్రమిస్తుంటే అదే కుటుంబంలో జన్మించిన రామ్ చరణ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విచారకరమని పేర్కొన్నారు. రామ్‌చరణ్ బేషరత్‌గా అయ్యప్ప భక్తులకు, యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్ధృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Read Also : Whatsapp Feature: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చట!