HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Movie Confirmed With Uppena Director Officially Announced Here

Ram Charan: ఉప్పెన డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ ఫిక్స్.. అఫిషీయల్ అనౌన్స్!

ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి అనేక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

  • By Balu J Published Date - 02:10 PM, Mon - 28 November 22
  • daily-hunt
Ram Charan
Ram Charan

ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి అనేక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు మెగా హీరో రామ్ చరణ్ తదుపరి సినిమా కూడా ఏమిటి అనేది చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతోంది.  బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందనేది చాలా కాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఈ స్టార్ హీరో కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ చిత్రాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ని కూడా ఓకే చేశాడు. దీంతో బుచ్చిబాబు ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యువ దర్శకుడు త్వరలో రామ్ చరణ్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు పుకార్లు వచ్చాయి.

ఇప్పుడు ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత పాన్‌ఇండియన్‌ హీరోగా మారిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వెంకట సతీష్ కిలారు తన ‘వృద్ధి సినిమాస్’ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఆయనతో పాటు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ పై ఈ అఫీషియల్ అప్ డేట్ అంచనాలను పెంచేసింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ‘చిరుత’ హీరో ప్రస్తుతం లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో #RC15 సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్. ప్రస్తుతం టీమ్ అంతా న్యూజిలాండ్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ 2023 ద్వితీయార్థంలో విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Buchi Babu
  • latest tollywood news
  • mega fans
  • ramcharan

Related News

Peddi

Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

అయినప్పటికీ ఫస్ట్ గ్లింప్స్, మొదటి సింగిల్ రెండూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రమోషన్లు సరైన దిశలోనే సాగుతున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

    Latest News

    • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

    • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

    • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd