సినిమా కలలకు రకుల్ బాటలు.. ఔత్సాహిక కళాకారులకు ‘‘స్టారింగ్ యు’’
బిజీగా ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఒకవైపు నటనలో రాణిస్తూనే.. మరోవైపు తనకు ఇష్టమైన అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుంటుంది. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటుంది.
- By Balu J Published Date - 12:05 PM, Mon - 29 November 21
బిజీగా ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఒకవైపు నటనలో రాణిస్తూనే.. మరోవైపు తనకు ఇష్టమైన అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుంటుంది. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటుంది. ఫ్యాషన్ తోనూ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ కు ఫాలోవర్లు కూడా ఎక్కువే. 18 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో చాట్ చేస్తుంది ఈ బ్యూటీ.
అయితే సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. కోటి ఆశలతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంటారు. కానీ చాలామందికి నటనకు సంబంధించిన పద్ధతులు తెలియక లక్ష్యానికి దూరమవుతుంటారు. అలాంటివాళ్ల కోసం రకుల్ ప్రీత్ ఓ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాబోయే కళాకారులకు సహాయం చేయడానికి ‘స్టారింగ్ యు’ అనే యాప్‌ను కూడా ప్రారంభించింది. ‘‘చిన్నప్పటి నుండి మా నాన్న (మాజీ ఆర్మీ ఆఫీసర్) నాకు, నా బ్రదర్ అమన్ ప్రీత్ సింగ్‌కి ఎప్పుడూ ప్రయాణంలో ఉండటమో, ఏదో ఒక క్రీడలో పాల్గొనమని నేర్పించారు. అందుకే మేము ఎప్పుడూ వీడియో గేమ్‌లు ఆడలేదు. కనీసం కార్టూన్లు చూడలేదు. ఎల్లప్పుడూ శారీరక శ్రమలో మునిగిపోతాము. ఇప్పుడు మనం చేసే ప్రతి పనిలో అది కీలక పాత్ర పోషించింది,” అని రకుల్ షేర్ చెప్పింది.
“నేను సరిగ్గా పదమూడేళ్ల క్రితం నా కెరీర్ ప్రారంభించినప్పుడు.. దాదాపు మూడేళ్లు ఏమి చేయాలో నాకు తెలియదు. పరిచయాలు లేవు. సినిమా వ్యక్తులను ఎలా సంప్రదించాలనే దానిపై ఆలోచన లేదు, కాబట్టి నాలాంటి ఇతరులకు సహాయం చేయడానికి ఒక యాప్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. నా బ్రదర్ సినిమాల్లో రావడానికి, అతనికి మార్గనిర్దేశం నేను ఉన్నాను. అయితే ఇండస్ట్రీలో ఎవరూ లేని కొత్తవాళ్ల సంగతేంటి? ప్రపంచం డిజిటల్‌గా కనెక్ట్ అయినప్పుడు ఈ ఆలోచన వచ్చింది. స్టార్రింగ్ యు ద్వారా ఔత్సాహిక చలనచిత్ర ప్రతిభ కోసం లింక్డ్ ఇన్ లాంటి ప్లాట్‌ఫారమ్, మేము ప్రొడక్షన్ హౌస్‌లు, కాస్టింగ్ ఏజెన్సీలతో టైఅప్ చేసాం. రాబోయే నటీనటులు, దర్శకులు, ఎడిటర్లు, డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఇక్కడ ఆడిషన్ చేయవచ్చు’’ అని చెప్పింది. రకుల్ పెళ్లికి సంబంధించిన పుకార్ల గురించి అడిగినప్పుడు, నేను ప్రస్తుతం మంచి స్థానంలో ఉన్నాను. పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు కచ్చితంగా మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం నేను పని మీద మాత్రమే దృష్టి పెడుతున్నాను అని సమాధానమిచ్చింది.
రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ కూడా ఇటీవలే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘‘ఈ జనవరిలో నా రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. రకుల్ ప్రతిరోజూ ఆమె పడే కష్టాలతో నాకు స్ఫూర్తినిస్తుంది. మేమిద్దరం వృత్తిపరంగా కూడా బాగా పనిచేస్తాం.”అని రకుల్‌తో కలిసి ‘స్టారింగ్ యు’ స్థాపించిన అమన్ చెప్పారు.
Related News
Thug Life: కమల్, మణిరత్నం మూవీపై భారీ అంచనాలు.. ‘థగ్ లైఫ్’ రిలీజ్ ఎప్పుడంటే!
Thug Life: లెజెండ్స్ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ ప్రాజెక్టుకు విపరీతమైన హైప్ వస్తున్నా కమల్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా చాలా ఆలస్యమవుతోంది. షెడ్యూల్ విభేదాల కారణంగా జయం రవి, దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని పలు వార్తలు వచ్చాయి. దుల్కర్ పోషించాల్సిన పాత్రను శింబు చేయనున్నట్లు సమాచారం. ప్రస్త�