HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rakasa Sets Record Even Before Release

Rakasa : రిలీజ్‌కు ముందే ‘రాకాస’ రికార్డు..టేబుల్ ప్రాఫిట్‌తో నిహారిక మాస్టర్ ప్లాన్!

గతంలో నాగబాబు 'ఆరెంజ్' వంటి చిత్రాలతో మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ, రామ్ చరణ్ తన తండ్రి కోసం 'కొణిదెల ప్రొడక్షన్స్' స్థాపించి విజయవంతమైన నిర్మాతగా నిలిచారు

  • Author : Sudheer Date : 24-03-2026 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Niharika
Niharika

మెగా కుటుంబం నుంచి హీరోల హవా మాత్రమే కాదు, ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ మెగా వారసురాళ్లు తమ సత్తా చాటుతున్నారు. గతంలో నాగబాబు ‘ఆరెంజ్’ వంటి చిత్రాలతో మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ, రామ్ చరణ్ తన తండ్రి కోసం ‘కొణిదెల ప్రొడక్షన్స్’ స్థాపించి విజయవంతమైన నిర్మాతగా నిలిచారు. అదే బాటలో సుస్మిత కొణిదెల చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టి, ఈ సంక్రాంతికి విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సక్సెస్ మెగా కుమార్తెలలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, నిర్మాణ రంగంపై వారికి గట్టి నమ్మకాన్ని కలిగించింది. ఇప్పుడు నిహారిక కొణిదెల కూడా అదే వేగంతో వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్లు’ మంచి విజయం సాధించడంతో, ఇప్పుడు ఆమె దృష్టి అంతా ‘రాకాస’ చిత్రంపై ఉంది. విశేషం ఏంటంటే, ఈ సినిమా విడుదల కాకముందే టేబుల్ ప్రాఫిట్ (Table Profit) సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ వేసవిలో విడుదలవుతున్న చిన్న సినిమాల్లో రిలీజ్‌కు ముందే లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా ‘రాకాస’ రికార్డు సృష్టించింది. సినిమాపై ఉన్న క్రేజ్ మరియు బిజినెస్ నిహారికకు మంచి బూస్టప్‌ని ఇచ్చాయి. అందుకే ఆమె ప్రమోషన్లపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా, బుల్లితెరపై రియాలిటీ షో రన్నర్‌గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ సమ్మర్ రేసులో నిహారిక తన మార్క్ సక్సెస్ కొట్టడానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు.

ప్రస్తుతానికి నిహారిక చిన్న మరియు మధ్య తరహా బడ్జెట్ సినిమాలతో ‘ట్రయల్ బాల్’ ఆడుతున్నప్పటికీ, భవిష్యత్తులో మెగా హీరోలతో భారీ చిత్రాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు. సొంత ఇంట్లోనే స్టార్ హీరోలు ఉండటంతో, నిర్మాణ రంగంలో పూర్తి అనుభవం సంపాదించిన తర్వాత నేరుగా వారితో ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న ‘రాకాస’ విడుదలకు సిద్ధమవుతుండగా, అదే రోజున ‘బైకర్’ అనే మరో సినిమా కూడా వస్తోంది. అయితే ఈ రెండు భిన్నమైన జోనర్లకు చెందిన సినిమాలు కావడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వేసవిలో మెగా డాటర్ తన ‘రాకాస’తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 'Rakasa' sets record
  • niharika konedala
  • Rakasa
  • Rakasa movie
  • Rakasa niharika
  • Rakasa release
  • Rakasa review

Related News

    Latest News

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd