Getup Srinu : హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న గెటప్ శ్రీను
రాజు యాదవ్ చూడు అనే పాట విడుదల చేసి మ్యూజికల్ జర్నీ ప్రారంభించింది
- By Sudheer Published Date - 07:27 PM, Thu - 16 November 23
జబర్దస్త్ (Jabardasth) షో ద్వారా బుల్లితెరకు పరిచమైన కమెడియన్స్ అంత ఇప్పుడు చిత్రసీమలో రాణిస్తున్నారు. హీరోగా, డైరెక్టర్స్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టులు గా ఇలా అనేక రంగాలలో రాణిస్తున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) , షకలక శంకర్ , రచ్చ రవి తదితరులు హీరోలుగా రాణిస్తుండగా..తాజాగా వీరి లిస్ట్ లో గెటప్ శ్రీను (Getup Srinu) జాయిన్ అయ్యాడు. జూనియర్ కమల్ హాసన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీను..ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యాడు.
We’re now on WhatsApp. Click to Join.
కృష్ణమాచారి డైరెక్టర్ గా పరిచయమవుతూ..తెరకెక్కుతున్న మూవీ ‘రాజు యాదవ్’ (Raju Yadav). సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా… ఇక ఇప్పుడు సినిమా యూనిట్ ఫస్ట్ సింగిల్-రాజు యాదవ్ చూడు అనే పాట విడుదల చేసి మ్యూజికల్ జర్నీ ప్రారంభించింది. ఈ సాంగ్ ను డైరెక్టర్ బాబీ విడుదల చేయగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యాజికల్ మెలోడీని అందించారు.
చౌరస్తా ఫేమ్ రామ్ మిరియాల తన అద్భుతమైన వాయిస్ తో మరింత అందంగా ఆలపించగా ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ అద్భుతమైన మెలోడీ, హీరో తన ప్రేయసి పాత్ర పోషిస్తున్న అంకిత ఖరత్ పై తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు చాలా అందంగా ప్రెజంట్ చేసేలా ఈ పాటను డిజైన్ చేశారు. మరి ఈ సాంగ్ ఫై మీరు ఓ లుక్ వెయ్యండి.
Read Also :