Lal Salaam: రజనీ లాల్ సలాం రిలీజ్ కు రెడీ.. ముంబై డాన్ గా తలైవర్
'జైలర్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తలైవర్ ఇప్పుడు 'లాల్ సలాం'తో సంక్రాంతికి అలరించబోతున్నాడు.
- By Balu J Published Date - 03:10 PM, Mon - 2 October 23

Lal Salaam: తాజాగా ‘జైలర్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తలైవర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అలరించబోతున్నాడు. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను 2024 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానరుపై నిర్మితమవుతున్న చిత్రం లాల్ సలామ్. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.
ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా నటిస్తున్నారు. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్, విధార్థ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లాల్ సలాం చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జైలర్ తర్వాత ఈ మూవీలో రజనీ నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: AP BRS: ఏపీ పాలన గాలికొదిలేసిన వైకాపా ప్రభుత్వం: ఏపీ బీఆర్ఎస్ చీఫ్