HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamouli Tweet On Pushpa 2

Pushpa 2 : పుష్ప పార్టీ ఎప్పుడు..రాజమౌళి ట్వీట్

Pushpa 2 : ‘పట్నాలో WILDFIRE మొదలైంది. దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న పేలనుంది. పార్టీ కోసం ఎదురుచూస్తుంటా పుష్ప' అని పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 18-11-2024 - 2:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajamouli Pushpa 2
Rajamouli Pushpa 2

నేషనల్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప-2’ (Pushpa 2 Trailer ) ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు , సినీ ప్రేక్షకులే కాదు అగ్ర దర్శకులు , నిర్మాతలు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు స్పందిస్తూ..సినిమా పై మరింత క్రేజ్ తీసుకొస్తున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేస్తూ..పుష్ప పార్టీ ఎప్పుడు అంటూ అడిగాడు. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 05 న వరల్డ్ వైడ్ గా అనేక భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో చెప్పాల్సిన పనిలేదు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమా తెరకెక్కిందని తాజాగా విడుదలైన ట్రైలర్ చెప్పకనే చెపుతుంది.

పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (Pushpa 2 Trailer Launch) నిన్న ఆదివారం సాయంత్రం పాట్నా(Patna)లో గాంధి మైదాన్ లో అట్టహాసంగా జరిగింది. UV మీడియా ఈ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఊహించినదానికంటే ఎక్కువ మంది తరలివచ్చారు. దీంతో గాంధీ స్టేడియం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. నార్త్ండియాలో మన తెలుగు హీరోకు ఇంత క్రేజ్ ఉండడం చూసి నార్త్ హీరోలు , సినీ ప్రముఖులుషాక్ అవుతున్నారు.

ఇక ట్రైలర్ కటింగ్ కూడా అదిరిపోయింది. సీక్వెల్​లో పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్​లో ఎదిగిపోయినట్లు చూపించారు. ప్రతి షాట్ ఊర మాస్​గా ఉంది. ఫుల్ పవర్ ప్యాక్డ్​ యాక్షన్ సీన్స్​తో సుకుమార్ సినిమాపై అంచనాలు మరో లెవెల్​కు తీసుకెళ్లారు. బన్నీ డైలాగ్స్, మేనరిజం మరోసారి ట్రెండ్ సెట్ చేయనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ షెఖావత్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్​గా ఉంది. ‘పుష్ప అంటే ఫైర్ కాదు- వైల్డ్ ఫైర్’ అనే కొత్త డైలాగ్​తో ఈసారి బన్నీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపబోతున్నట్లు అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ట్రైలర్ చూసిన పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. ‘పట్నాలో WILDFIRE మొదలైంది. దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న పేలనుంది. పార్టీ కోసం ఎదురుచూస్తుంటా పుష్ప’ అని పేర్కొన్నారు. ఇక రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశంసలు కురిపించడం తో బన్నీ అభిమానుల సంతోషం మాములుగా లేదు.

WILDFIRE started in Patna!!
Spreading across the country!!
Explodes on Dec 5th!!!

CAN’T WAIT for the party PUSHPA!!!

— rajamouli ss (@ssrajamouli) November 18, 2024

Read Also : Lady Aghori Arrest : పోలీసులపై దాడి చేసిన అఘోరీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pushpa 2
  • Pushpa 2 Trailer
  • Pushpa 2 Trailer Launch
  • rajamouli
  • rajamouli tweet

Related News

Mahesh Babu Varanasi

జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతోంది. అయితే, తదుపరి భారీ షెడ్యూల్ కోసం చిత్ర బృందం జార్జియా వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి ఇప్పటికే లొకేషన్ల ఎంపికను

    Latest News

    • ఇలా తయారేంట్రా బాబు !! భర్త ను ప్రియుడితో కలిసి ఆక్సిడెంట్ చేసి హత్య చేసిన భార్య

    • IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్

    • యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి తలలు పట్టుకున్న నిర్మాతలు

    • లోక్‌సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!

    • అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!

    Trending News

      • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

      • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

      • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd