Lavanya – Masthan Sai : మస్తాన్ సాయి కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు.. రాజ్ తరుణ్ చెప్పింది నిజమేనా?
ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న మస్తాన్ సాయిని పిటి వారెంట్ ద్వారా హైదరాబాద్ తరలించి విచారించనున్నారు.
- By News Desk Published Date - 11:28 AM, Tue - 13 August 24

Lavanya – Masthan Sai : ఇటీవల రాజ్ తరుణ్ – లావణ్య కేసు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. లావణ్య రాజ్ తరుణ్ పై అనేక ఆరోపణలు చేయగా రాజ్ తరుణ్ మాత్రం అవన్నీ ఆరోపణలు మాత్రమే. మేము గతంలో ప్రేమించుకున్నది నిజమే కానీ ఆమె డ్రగ్స్ కి అలవాటయింది. మస్తాన్ సాయి అనే వ్యక్తితో తిరుగుతుంది. డ్రగ్స్ సంబంధిత వ్యక్తులతో తిరుగుతుంది, ఎంత చెప్పినా మారలేదు అందుకే బ్రేకప్ చెప్పాను అని అన్నాడు.
అయితే ఆ కేసులో మస్తాన్ సాయి పేరు బాగా వైరల్ అయింది. లావణ్య మస్తాన్ సాయి నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పడం, కావాలంటే మస్తాన్ సాయిని కూడా మీడియా ముందుకు తెస్తాను అని చెప్పింది. గతంలో లావణ్య మస్తాన్ సాయి పైన కూడా పోలీసులకు కంప్లైంట్ గమనార్హం. కానీ రాజ్ తరుణ్ – లావణ్య ఇష్యూ బయటకి వచ్చినప్పటినుంచి మస్తాన్ సాయి కనపడకుండా పోయాడు.
అయితే డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయి కోసం ఇరు రాష్ట్రాల పోలీసులు గాలింపు చేపట్టగా నిన్న విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న మస్తాన్ సాయిని పిటి వారెంట్ ద్వారా హైదరాబాద్ తరలించి విచారించనున్నారు. ఇప్పటికే విజయవాడలో మస్తాన్ సాయిని విచారించగా ఢిల్లీ, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్నాడు. లావణ్య డ్రగ్స్ కేసులో కూడా మస్తాన్ సాయి కీలక పాత్ర పోషించాడు. రాజ్ తరుణ్ – లావణ్య ఇష్యూ వల్ల మస్తాన్ సాయి మరోసారి వైరల్ అయి పోలీసులకు పట్టుపడ్డాడు. గతంలో కూడా మస్తాన్ సాయి పై అనేక ఆరోపణలు ఉన్నాయి. పలు పార్టీలకు మస్తాన్ సాయి డ్రగ్స్ సప్లై చేస్తాడని సమాచారం. మస్తాన్ సాయిని కస్టడీ లోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
దీంతో రాజ్ తరుణ్ చెప్పింది నిజమేనా, మస్తాన్ సాయి, అతని మనుషులు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని అలాంటి వాళ్ళతో లావణ్య సంబంధం పెట్టుకుందని, లావణ్య కూడా డ్రగ్స్ కి అలవాటైంది రాజ్ తరుణ్ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమేనేమో అని భావిస్తున్నారు అంతా.
Also Read : Murari Sequel : ‘మురారి’ సీక్వెల్ పై కృష్ణవంశీ కామెంట్స్.. అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు..