Cinema: రాధేశ్యామ్’ వర్కింగ్ స్టిల్స్ పంచుకున్న దర్శకుడు
- By hashtagu Published Date - 04:49 PM, Mon - 10 January 22

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా విజృంభణ లేకపోతే రాధేశ్యామ్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల అయ్యేది. జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విడుదల తేదీని చిత్రబృందం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఉత్సాహం కలిగించేందుకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ వర్కింగ్ స్టిల్స్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
Hello all!! Here are some working stills of our darlings #Vikramaditya and #Prerana from #radheshyam !! Let’s all stay low to come back stronger🤗🤗 pic.twitter.com/cqiSBjsa74
— Radhaa Krishna (@director_radhaa) January 10, 2022