Game Changer : ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో వచ్చేసింది
Game Changer : 'రా మచ్చా మచ్చా' ప్రోమో.. ఈ సాంగ్ కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. ఈ ఫుల్ సాంగ్ ను ఈ నెల 30 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రోమో లో తెలిపారు.
- By Sudheer Published Date - 06:30 PM, Sat - 28 September 24

”గేమ్ ఛేంజర్” (Game Changer) రెండో సాంగ్ వచ్చేసిందోచ్. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ”గేమ్ ఛేంజర్” (Game Changer) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా..దీనిని దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఈ మూవీ మొదలుపెట్టి చాల నెలలే అవుతున్న సరైన ప్రమోషన్ చేయకపోవడం పట్ల మేకర్స్ మెగా అభిమానులు ఆగ్రహం గా ఉన్నారు. అదిగో..ఇస్తున్నాం..ఇదిగో ఇస్తున్నాం అని చెప్పడమే కానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం తో సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో రెండు రోజుల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ..చిత్రంలోని సెకండ్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపి హమ్మయ్య అనిపించాడు. చెప్పినట్లే శనివారం సాయంత్రం సినిమాలోని సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో (Raa Macha Macha – Song Promo) ను విడుదల చేసారు.
మొదటి సాంగ్ కాస్త నెగిటివ్ టాక్ రావడం తో సెకండ్ విషయంలో థమన్ జాగ్రత్త పడ్డట్లు సాంగ్ చూస్తే అర్ధం అవుతుంది. ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ (Raa Macha Macha Song) కు థమన్ (Thaman) మంచి మాస్ బిట్స్ అందజేశాడు. ఈ సాంగ్ కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. ఈ ఫుల్ సాంగ్ ను ఈ నెల 30 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రోమో లో తెలిపారు. ఈ పాటలో ఏపీ, ఒరిస్సా, కర్ణాటక, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులను, వారి సాంప్రదాయ నృత్యాలను ఇందులో భాగం చేశామని , ఇండియాలోని 1000 మందికి పైగా జానపద కళాకారులతో ఈ పాటను షూట్ చేసినట్లు ఇప్పటికే శంకర్ తెలిపి సాంగ్ ఫై అంచనాలు పెంచారు. సినిమాలో ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తుంది. 2024 క్రిస్మస్ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
Read Also : TTD Laddu Row : బీజేపీతో పోరాడాలని జగన్ నిర్ణయించుకున్నారా?