Puri Jagannadh Divorce : ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన డైరెక్టర్ పూరి విడాకుల వార్త..
- By Sudheer Published Date - 10:41 PM, Tue - 30 January 24

డాషింగ్ డైరెక్టర్ పూరి (Puri)..తన భార్య లావణ్య (Lavanya) కు విడాకులు (Divorce ) ఇచ్చేందుకు సిద్దమయ్యాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. పూరి జగన్నాధ్..లావణ్య ను ఓ షూటింగ్ టైములో చూసి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఆకాష్ , కావ్య అనే కొడుకు , కూతురు ఉన్నారు. ఇద్దరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సత్తా చాటి..ప్రస్తుతం ఇండస్ట్రీ లో హీరోగా ఆకాష్ రాణిస్తుండగా..కావ్య కూడా సినిమా ఛాన్సులు కొట్టేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె గత కొద్దీ కాలంగా నటి ఛార్మి తో పూరి సహజీవనం చేస్తున్నాడనే వార్త వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడిన పూరి కానీ , ఛార్మి కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఒకానొక టైములో పూరి తన ఫ్యామిలీ ని పూర్తిగా వదిలేసాడనే వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. కానీ దీనిని పూరి కుటుంబ సభ్యులు ఖండించలేదు. దీంతో కొన్ని రోజులుగా దీని గురించి మాట్లాడిన..ప్రచారం జరిగిన ఆ తర్వాత అంత సైలెంట్ అయ్యింది. ఈ లోపు పూరి ఇస్మార్ట్ తో హిట్ కొట్టడం..ఆ తర్వాత లైగర్ తో భారీ ప్లాప్ చవిచూడడం జరిగిపోయింది.
ఇక ఇప్పుడు మరోసారి పూరి – లావణ్య ల విడాకుల అంశం తెరపైకి వచ్చింది. పూరి జగన్నాథ్ తన భార్య లావణ్యకు విడాకులు(Divorce) ఇచ్చి చార్మీని(Charmi kaur) పెళ్లి చేసుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజముందో లేదో కానీ.. ఇండస్ట్రీలో అయితే టాక్ నడుస్తోంది. మరి ఇప్పుడైనా ఈ వార్తలపై పూరి కానీ ఛార్మి కానీ స్పందిస్తారో చూడాలి.
Read Also : Megastar Viswambhara : తమిళ స్టార్ ని బుక్ చేశారా.. మెగా విశ్వంభర అనుకున్న దానికన్నా పెద్దగా..!