Akkineni Akhil: అఖిల్ విషయంలో మళ్ళీ అది తప్పు చేస్తున్న నిర్మాతలు?
టాలీవుడ్ అక్కినేని హీరో అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీ గురించి వచ్చిన అఖిల్ హీరోగా
- By Nakshatra Published Date - 07:02 PM, Sat - 2 December 23
టాలీవుడ్ అక్కినేని హీరో అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీ గురించి వచ్చిన అఖిల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్ళు పూర్తి అవుతున్న కూడా అఖిల్ కెరియర్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సరైన హిట్ ఒకటి కూడా లేదు. ఐదు సినిమాలలో నటించగా అందులో ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ కానీ బ్లాక్ బస్టర్ హిట్ కానీ అవ్వలేదు. అంతేకాకుండా కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఏజెంట్ అఖిల్ వంటి సినిమాలు కూడా ఊహించని విధంగా దారుణంగా నష్టాలను మిగిల్చాయి.
దీంతో అఖిల్ కెరియర్ పై అక్కినేని అభిమానులు దిగులు చెందుతున్నారు. మరొకవైపు అఖిల్ తో సినిమాలు చేయడానికి కూడా డైరెక్టర్లు నిర్మాతలు ముందుకు రావడం లేదు. అయితే అఖిల్ తో కథాబలం ఉన్న మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే తీయాలి. సాలిడ్ హిట్ పడిన తర్వాతే భారీ బడ్జెట్ మూవీ చెయ్యాలి అనేది ప్రస్తుతం ట్రేడ్ వర్గాల మాట. కానీ నిర్మాతలు మాత్రం అతని రేంజ్ మామూలుది కాదు అని భావిస్తున్నారు. ఏజెంట్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత కూడా కొన్ని నిర్మాణ సంస్థలు అఖిల్ పై గట్టి నమ్మకంగా ఉన్నాయి. అంతేకాకుండా అఖిల్ తో కోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మించడానికి కూడా రెడీగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం..
అఖిల్ తదుపరి చిత్రం కూడా దాదాపుగా 70 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందట. యూవి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నారు. ఇందులో గ్రాఫిక్స్ వగైరా భారీగా ఉంటాయట. కాగా ఈ సినిమాకి ధీర అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కనీసం అఖిల్ ఈ సినిమాతో అయినా ఒక హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి మరి. అయితే అఖిల్ గత సినిమాల పరిస్థితి కూడా నిర్మాతలు మళ్లీ అఖిల్ తో కోట్ల బడ్జెట్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తుండడంతో చాలామంది నిర్మతలు మళ్లీ మళ్లీ అఖిల్ విషయంలో తప్పు చేస్తున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే ఆ సినిమా అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే మరి.
Related News
Akhil : లుక్స్ ఓకే కానీ అనౌన్స్ మెంట్ ఎప్పుడు రాజా..?
Akhil అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ రిలీజ్ టైం లో రెగ్యులర్ గా వార్తల్లో ఉండగా ఆఫ్టర్ ఏజెంట్ రిలీజ్ నెక్స్ట్ డే నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏజెంట్ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు