Priyanka Chopra : ఆస్తులు అమ్మేసిన ప్రియాంక చోప్రా..కారణం అదే !
Priyanka Chopra : వెస్ట్ ముంబై అంధేరి ప్రాంతంలోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్ అపార్ట్‌మెంట్(Lokhandwala Complex in Oshiwara)లో నాలుగు ఫ్లాట్లను ఆమె విక్రయించారు
- By Sudheer Published Date - 09:49 PM, Fri - 7 March 25

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra ) ముంబైలోని విలాసవంతమైన తన ఆస్తులను అమ్మేసినట్లు (Priyanka Chopra sells assets) తెలుస్తోంది. వెస్ట్ ముంబై అంధేరి ప్రాంతంలోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్ అపార్ట్‌మెంట్(Lokhandwala Complex in Oshiwara)లో నాలుగు ఫ్లాట్లను ఆమె విక్రయించారు. మొత్తం రూ. 16.17 కోట్లకు ఈ ఫ్లాట్లను అమ్మినట్లు సమాచారం. గతంలో కూడా ఆమె ముంబైలోని మరో రెండు ఫ్లాట్లను అమ్మిన సంగతి తెలిసిందే. ప్రస్తుత నివాసం అమెరికాలో ఉండటమే, ఈ అమ్మకాల ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
అమెరికాలో స్థిరపడిన ప్రియాంక
ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన భర్త నిక్ జోనస్, కుమార్తె మేరీ చోప్రాతో కలిసి అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో స్థిరపడిపోయారు. హాలీవుడ్ ప్రాజెక్టులు, ఇతర అంతర్జాతీయ కమిట్‌మెంట్‌ల వల్ల ఆమె ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్నారు. అందువల్ల భారతదేశంలోని ప్రాపర్టీలు ఆమెకు అవసరం లేదని భావించి, విక్రయిస్తున్నట్లు సమాచారం. ముంబైలో ఉన్నప్పుడు ఆమె ఈ ఫ్లాట్లను కమర్షియల్ యూజ్ కోసం అద్దెకు ఇచ్చినట్లు సమాచారం.
ముంబైలో ప్రియాంకకు ఇక ఆస్తులు లేవా?
ప్రియాంక చోప్రా గతంలోనే తన ముంబై ఆస్తులను తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు ఆమెకు ఉన్న మొత్తం ఆరు ఫ్లాట్లలో ఐదు అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబైలో ఆమెకు ఇంకా ఎంతో విలువైన కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రియాంక ఇప్పుడిప్పుడే భారతదేశంలో తన ఆస్తులను తగ్గిస్తూ, పూర్తిగా అమెరికాలో స్థిరపడేందుకు చూస్తున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రియాంక కెరీర్‌పై ప్రభావం?
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రాజెక్టులపై పూర్తిగా దృష్టి పెట్టారు. బాలీవుడ్ సినిమాల్లో ఆమె తక్కువగా కనిపిస్తూ అంతర్జాతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఎక్కువగా చేస్తున్నారు. సిటాడెల్, లవ్ అగైన్ వంటి ప్రాజెక్టులతో ఆమె గ్లోబల్ స్టార్‌గా మరింత ముందుకు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలోని ఆస్తులను అమ్మడం, ఆమె ఇక ముంబైలో ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదనే అర్థాన్ని ఇస్తోంది. ప్రియాంక భవిష్యత్తు కెరీర్, వ్యక్తిగత జీవితం అమెరికాకే పరిమితమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
RT76 : రవితేజకు జోడిగా ఆ ఇద్దరు భామలు