Sapta Sagaralu Dati Side B : ప్రైం వీడియోలో మిస్సైన సప్త సాగరాలు సైడ్ బి.. కారణాలు ఏంటి..?
Sapta Sagaralu Dati Side B రక్షిత్ శెట్టి లీడ్ రోల్ లో హేమంత్ ఎం రావు డైరెక్షన్ లో వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. లవ్ స్టోరీనే అయినా ఈ సినిమాను సైడ్ A, సైడ్ B అంటూ రెండు భాగాలుగా రిలీజ్
- By Ramesh Published Date - 03:46 PM, Sat - 23 March 24

Sapta Sagaralu Dati Side B రక్షిత్ శెట్టి లీడ్ రోల్ లో హేమంత్ ఎం రావు డైరెక్షన్ లో వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. లవ్ స్టోరీనే అయినా ఈ సినిమాను సైడ్ A, సైడ్ B అంటూ రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ లో సైడ్ A నవంబర్ లో సైడ్ B రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ప్రేమకథలకు తెలుగులో ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుందని తెల్సిందే. ఈ క్రమంలో సప్త సాగరాలు సినిమాకు కూడా తెలుగు ఆడియన్స్ మంచి మార్కులు వేశారు.
రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ ల ప్రేమకథ తెలుగు ఆడియన్స్ కు నచ్చేసింది. ఐతే సప్త సాగరాలు దాటి సైడ్ ఏ ఇప్పటికే ప్రైం వీడియోలో అందుబాటులో ఉండగా సైడ్ బి కోసం చాలా కాలం ఎదురుచూశారు. అయితే ఆడియన్స్ ఎదురుచూపుల తాకిడికి అగ్రిమెంట్ బేస్ మీద ప్రైం వీడియో సప్త సాగరాలు సైడ్ బి ని స్ట్రీమింగ్ చేసింది.
అయితే ఈమధ్య ఆ లైసెస్న్ పరిధి పూర్తి కావడంతో ప్రైం వీడియో నుంచి సప్త సాగరాలు దాటి సైడ్ బి ని తీసేశారు. సడెన్ గా ప్రైం వీడియో నుంచి సైడ్ బి తీసేయడంతో ఆ సినిమా లవర్స్ అంతా కంగారు పడ్డారు. సప్త సాగరాలు సినిమాను జీ నెట్ వర్క్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. సైడ్ బి ఓటీటీ రైట్స్ కూడా జీ 5కి దక్కాయని తెలుస్తుంది. సో త్వరలో సప్త సాగరాలు దాటి సైడ్ బి జీ 5 లో రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.
Also Read : Venkatesh 76 : వెంకటేష్ 76 అప్డేట్.. దగ్గుబాటి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!