Preity Mukhundhan : మంచు విష్ణు కన్నప్పలో హీరోయిన్ ఈమె.. తమిళమ్మాయి..
కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకి జోడిగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్ ని తీసుకున్నారు. కానీ నుపుర్ పలు కారణాలతో సినిమా నుంచి తప్పుకుంది.
- Author : News Desk
Date : 14-12-2023 - 7:33 IST
Published By : Hashtagu Telugu Desk
మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు కన్నప్ప(Kannappa) సినిమాని భారీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్ అడవుల్లో షూట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
కన్నప్ప సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నారు. దీంతో ఈ సినిమాలో అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని తీసుకుంటున్నారు. ఇప్పటికే మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, నయనతార, మధుబాల, శివరాజ్ కుమార్.. మరింతమంది స్టార్లు ఈ సినిమాలో ఉన్నారని ప్రకటించారు.
గతంలో కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకి జోడిగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్ ని తీసుకున్నారు. కానీ నుపుర్ పలు కారణాలతో సినిమా నుంచి తప్పుకుంది. దీంతో ఇన్ని రోజులు ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరు చేస్తారా అని ఆలోంచించగా తాజాగా కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకి జోడిగా చేసే అమ్మాయిని ప్రకటించారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రీతి ముకుందన్(Preity Mukhundhan) అనే భామని కన్నప్ప సినిమాలో తీసుకున్నారు.
ప్రీతి ముకుందన్ తమిళ్ లో మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి అనేక యాడ్స్ చేసి సినిమాల్లోకి వచ్చింది. ఒక సినిమాలో హీరోయిన్ గా చేసి ఇంకో సినిమాని ప్రకటించింది. ఇప్పుడిప్పుడే తమిళ్ పరిశ్రమలోకి వస్తున్న ఈ భామని మంచు విష్ణు సెలెక్ట్ చేసి పాన్ ఇండియాకి పరిచయం చేయబోతున్నాడు. ఇక కన్నప్ప సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 2024 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
Also Read : Harish Shankar : పవన్ కళ్యాణ్ సినిమా వదిలేసి.. రవితేజతో మొదలుపెట్టిన హరీష్ శంకర్..