Director Murthy : నీ చావు బ్రతుకులను దృవీకరించేది ప్రభుత్వం.. ఓటు వెయ్యకపోతే చచ్చిపో..
ప్రతినిధి 2 సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్ డైరెక్టర్ మూర్తి.. ఓటు వెయ్యకపోతే చచ్చిపో అంటున్నారు. ఎందుకంటే..
- By News Desk Published Date - 11:16 AM, Sat - 11 May 24

Director Murthy : తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్ డైరెక్టర్ మూర్తి.. దర్శకుడిగా పరిచయం అవుతూ ‘ప్రతినిధి 2’ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం.. నిన్న (మే 10) రిలీజ్ అయ్యింది. ఎన్నికల సమయంలో వచ్చిన ఈ సినిమాలో ఓటు యొక్క విలువని తెలియజేసేలా మూర్తి కథని రాసుకున్నారు. ఈక్రమంలోనే టీజర్‌లో.. ‘ఓటు వేయని వారు దేశం వదిలి వెళ్లిపోండి లేదా చచ్చిపోండి’ అంటూ ఒక డైలాగ్ ని రాసుకొచ్చారు.
ఇక ఈ డైలాగ్ గురించి డైరెక్టర్ మూర్తిని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “1952లో మొదలైన జనరల్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 60 పర్సెంటేజ్ మాత్రమే. మిగితా 40 శాతం ఓటర్స్ మాకెందుకని వదిలేస్తున్నారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే.. వాళ్ళ చావు బ్రతుకులను దృవీకరించేది ఆ ఓటే. పుట్టావని తెలియడానికి బర్త్ సర్టిఫికెట్, మరణించామని తెలియడానికి డెత్ సర్టిఫికెట్, అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్, స్టడీ.. ఇలా మన ప్రతి విషయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది.
అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోకుండా ఓటుని వృధా చేసేవారు చచ్చిపోవడమే కరెక్ట్. ఎందుకంటే, గ్రామాల్లో ఓటు వెయ్యకపోతే అక్కడి ప్రజలు అలాగే ఫీల్ అవుతుంటారు. తన ఓటుని ఎవరైనా వేస్తే.. పోలింగ్ బూత్ వద్ద ఆ ఓటర్ గొడవ చేస్తాడు. నేను ఏమైనా చనిపోయాను అనుకున్నావా..? అంటూ నిలదీస్తాడు. ఓటు వేయకుంటే తాను చనిపోయినట్లే అని గ్రామస్థులు ఇప్పటికీ భావిస్తారు. అందుకే ఆ డైలాగ్ ని రాసాను” అంటూ చెప్పుకొచ్చారు.
నీ పుట్టుక నుండి చావు వరకు అన్ని ధృవకరించేది ప్రభుత్వమే…
అలాంటి ప్రభుత్వాన్ని నువ్వు ఓటు వేసి ఎన్నుకోకపోతే… చచ్చిపోవచ్చు….
– Director Murthy about importance of ‘VOTE’ at #Prathinidhi2 Press Meet. pic.twitter.com/pZ4vYpEpP2
— Gulte (@GulteOfficial) May 9, 2024