Prathinidhi 2 : ఆసక్తిరేపుతున్న ‘ప్రతినిధి 2’ కాన్సెప్ట్ టీజర్ ..
నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ప్రతినిధి 2
- Author : Sudheer
Date : 26-07-2023 - 2:24 IST
Published By : Hashtagu Telugu Desk
నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ప్రతినిధి 2 (Prathinidhi 2 ) . టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి (TV5 Murthy) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ మూవీ ని వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్ ను మేకర్స్ విడుదల చేసి ఆసక్తి నింపారు. టీజర్ చూస్తుంటే పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు అర్ధమవుతుంది.
ఈ టీజర్ (Prathinidhi 2 Concept Video) విషయానికి వస్తే..టీజర్ అంత అంతా బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ విజువల్స్.. వార్తాపత్రికలను హైలైట్ చేస్తూ చూపించారు. ఆ పత్రికల్లో ఓట్లు మాయం, యువత రావాలి, హింస పెరిగిపోతోంది వంటి హెడ్ లైన్స్‌ను హైలైట్ చేసారు. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ కార్యాలయంలో బాంబ్ బ్లాస్ జరిగి అది పేలిపోతుంది. దాని వెనకే.. వేల మంది జనం ఉన్న పొలిటికల్ మీటింగ్ సభ ఒకటి జరుగుతున్నట్లు చూపించారు. సమాజంలో జరిగే అసమానతలను ఎదుర్కొనేందుకు ఒక్కడు నిలబడతాడు అంటూ మళ్లీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే ఇది పక్క పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ గా అర్ధం అవుతుంది.
వీరభోగ వసంత రాయలు సినిమా తర్వాత నారా రోహిత్ (Nara Rohith) నుండి వస్తున్న సినిమా ఇది. జనవరి 25 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Also: బ్రహ్మాజీ కూడా శ్రీలీలనే కోరుకుంటున్నాడు