Prakash Raj Vs Pawan : ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ ..ఈసారి కూడా పవన్ను ఉద్దేశించేనా..?
Prakash Raj Vs Pawan Kalyan : ” గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం..
- By Sudheer Published Date - 02:49 PM, Thu - 26 September 24

సినీ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) వరుస ట్వీట్స్ జనసేన శ్రేణుల్లో , మెగా అభిమానుల్లో ఆగ్రహం నింపుతున్నాయి. తిరుమల లడ్డు (Tirumala Laddu) ఫై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్స్ ఫై పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఫై ట్వీట్ చేస్తూ వస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ముందుగా ‘నేను చెప్పింది ఏంటి.. మీరు అర్థం చేసుకుందేంటీ పవన్ కళ్యాణ్. మీరు తప్పుగా అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటని సెటైర్ లు వేశారు. ప్రస్తుతం తాను.. విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని .. ఈనెల చివరను 30 తారీఖున వరకు వస్తానని .. ఆ తర్వాత ప్రతి మాటకు సమాధానం చెప్తానని … ఇంతలోపు వీలైతే నా ట్వీట్ ని మళ్లీ ఒకసారి చదివి అర్థం చేసుకోండని ప్రకాష్ రాజ్ మొదటగా ట్వీట్ చేసాడు.
ఆ తర్వాత కార్తీ..పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పిన నేపథ్యంలో మరో ట్వీట్ చేసాడు. ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిందేనని నెటిజన్లు , అభిమానులు భావించారు. ఇప్పుడు మరో ట్వీట్ చేసాడు. ” గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం..? జస్ట్ ఆస్కింగ్” అంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా వరుస ట్వీట్ చేస్తూ కూటమి శ్రేణుల్లో , మెగా అభిమానుల్లో ఆగ్రహం నింపుతున్నాడు. మరి వీటికేమైనా పవన్ స్పందిస్తాడా అనేది చూడాలి.
Read Also : RG Kar Case : భిన్నమైన ఫోరెన్సిక్ సర్జన్, శవపరీక్ష సహాయకుడి వాంగ్మూలాలు