నేను దేవుణ్ణి కాను.. మీలో ఒకడిని కూడా కాదు!
‘బాహుబలి’ మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. బాహుబలి, బాహుబలి-2, సోహా సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు.
- By Balu J Published Date - 02:29 PM, Tue - 26 October 21
‘బాహుబలి’ మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. బాహుబలి, బాహుబలి-2, సోహా సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఇప్పటికే ఆయన చేతిలో మూడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి ‘రాధేశ్యామ్’ మూవీ. ప్రభాస్ నటించబోయే ఈ పాన్-ఇండియన్ మూవీలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడిగా నటిస్తున్నాడు ప్రభాస్. తన 42వ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రొడక్షన్ హౌస్లు UV క్రియేషన్స్, T-సిరీస్లు మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటంది? ఏవిధంగా ఉంటుంది? అనే విషయాలు టీజర్ లో చూడొచ్చు.
With more than 80 Million+ Views In 24 Hours, #Vikramaditya sets the internet on fire! 🔥🔥 Thank you everyone for all your love & support! #RadheShyamTeaser
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/dKjqKagPJA— UV Creations (@UV_Creations) October 24, 2021
“నేను దేవుణ్ణి కాను, కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు” అని అంటాడు. హస్తసాముద్రికుడిగా భవిష్యత్తును చదవగలడని టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రహస్యాలను బహిర్గతం చేయకూడదని ఇష్టపడతాడు, ఎందుకంటే అవి సాధారణ వ్యక్తులు అర్థం చేసుకోగలిగే వాటికి మించినవి అని అంటాడు.
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ రొమాన్స్ డ్రామాలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ మూవీ జనవరి 14, 2022న విడుదల కానుంది. సంగీతం జస్టిన్ ప్రభాకరన్, సౌండ్ డిజైన్ రెసూల్ పూకుట్టి మరియు సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, భాగ్యశ్రీ, జగపతి బాబు, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ లాంటివాళ్లు యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదల కానుండటం విశేషం.
Related News
Hanu-Man Release Date: హను-మాన్ ఆగమనం.. గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం!
హను మాన్ పలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లో రిలీజ్ కాబోతుంది.