Prabhas : రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన ప్రభాస్
Prabhas : ఈరోజు ప్రభాస్ స్వయంగా..రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. గాయత్రి మరణం తనను మానసికంగా మరింత కలచివేసిందని బాధపడ్డారు
- By Sudheer Published Date - 04:22 PM, Wed - 9 October 24

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను పాన్ ఇండియా ప్రభాస్ పరామర్శించారు. నాల్గు రోజుల క్రితం రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) కుమార్తె గాయత్రి (38) (Rajendra Prasad Daughter Gayathri) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండె పోటు రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఒక్కగాను ఒక్క కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ విషయం తెలిసి రాజేంద్ర ప్రసాద్‌ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , అల్లు అర్జున్ (Allu Arjun) , వెంకటేశ్ (Venkatesh), దర్శకుడు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి తో పాటు పలువురు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించి..వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇక ఈరోజు ప్రభాస్ (Prabhas) స్వయంగా..రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. గాయత్రి మరణం తనను మానసికంగా మరింత కలచివేసిందని బాధపడ్డారు ప్రభాస్. ఇక ప్రభాస్ గాయత్రి ఫోటో దగ్గర పూలు ఉంచి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.. అనంతరం రాజేంద్రప్రసాద్ తో మాట్లాడుతూ.. ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగిన రాజేంద్ర ప్రసాద్, మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కామెడీ హీరోగా మెప్పించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. గతంలో బేవార్స్ అనే సినిమా ఈవెంట్‌లో తన కుమార్తె గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. అమ్మ లేని వారు కూతురిలో వారి అమ్మను చూసుకుంటారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తన పదేళ్ల వయసులోనే తన తల్లి చనిపోయారని, అందుకే తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకున్నానని చెప్పుకొచ్చారు. కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన ‘తల్లి తల్లి నా చిట్టి తల్లి’ అనే పాట తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఆ సాంగ్‌ను గాయత్రికి ఎన్నో సార్లు వినిపించినట్లు తెలిపారు.
#Prabhas met #RajendraPrasad garu and paid heartfelt tributes to his late daughter.
pic.twitter.com/2Y1EZhKRrK— Prabhas Trends (@TrendsPrabhas) October 9, 2024
Read Also : Nobel Prize 2024 In Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి