Posani Krishnamurali : నిర్మాత అశ్వినీదత్ పై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు..
నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
- By News Desk Published Date - 09:00 PM, Mon - 1 May 23

తాజాగా నిర్మాత ఆదిశేషగిరి రావు ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ(Thammareddy Bharadwaja), అశ్వినీదత్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ నంది(Nandi Awards) అవార్డులు ఇవ్వట్లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అశ్వినీదత్(Aswinidutt) మాట్లాడుతూ అవార్డులు ఇవ్వట్లేదు, వీళ్ళు ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులు ఇచ్చుకుంటారేమో, ఇంకో రెండేళ్లు ఆగితే మనకు అవార్డులు వస్తాయి అని ఇండైరెక్ట్ గా వైసీపీ పై కౌంటర్లు వేశారు.
దీంతో నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అని కాదు మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు అవి కదా ఇవ్వాలి. ఉత్తమ వెదవలు, ఉత్తమ సన్నాసులు అని మీ వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకు మీరు జగన్ గారి మీద పడి ఏడుస్తున్నారు. మీకు ఏమి అన్యాయం చేశారు. చంద్రబాబు లాగా వెన్నుపోటు పొడిచాడా, ఫలానా వారికి అన్యాయం చేశాడు అని నిరూపించు నేను నీ కాళ్లకు దండం పెడతాను. ఎన్టీఆర్ ని చెప్పులతో కొట్టినప్పుడు నువ్వేం చేశావు?. నీ బతుకు నాకు తెలుసు. కొంచెం అయినా నీతితో బతుకు అని ఫైర్ అయ్యారు.
ఇక నంది అవార్డుల విషయంలో మాట్లాడుతూ.. జగన్ గారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుంది. అందులో రెండేళ్లు కరోననే ఉంది. దాని నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకున్నారు. ఆ తర్వాత దేనికి ప్రియారిటీ ఇవ్వాలో వాటికి ఇస్తున్నారు. జగన్ గారు వచ్చిన తరువాత నంది అవార్డులు ఇవ్వలేదు. ఇస్తే ఎవరూ పేరు పెట్టని విధంగా ఇస్తారు అని అన్నారు.
Also Read : Nandi Awards : ప్రభుత్వాలు పట్టించుకోవు.. నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణ సోదరుడు..