Poonam Kaur : ‘ఉస్తాద్’ టీజర్ పై పూనమ్ కామెంట్స్..నువ్వు లేకుండా అంటూ దోచేసింది
గుడ్ వన్ రాక్ స్టార్.. నువ్వు లేకుండా ఒక కమర్షియల్ సినిమా అనేది అసంపూర్ణంగుడ్ వన్ రాక్ స్టార్.. నువ్వు లేకుండా ఒక కమర్షియల్ సినిమా అనేది అసంపూర్ణం
- Author : Sudheer
Date : 19-03-2024 - 9:28 IST
Published By : Hashtagu Telugu Desk
నిత్యం వివాదస్పద ట్వీట్స్ తో మెగా అభిమానుల్లో ఆగ్రహం నింపే పూనమ్ కౌర్ (Poonam Kaur )..తాజాగా ఉస్తాద్ టీజర్ ఫై పాజిటివ్ గా స్పందించి ఆశ్చర్యం కలిగించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – హరీష్ శంకర్ (Harish Shankar) కలయికలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ మంగళవారం సాయంత్రం విడుదలై అభిమానుల్లో పూనకాలు పుట్టించింది. ముఖ్యంగా టీజర్ లో పవన్ కళ్యాణ్ చేత అసలైన సిసలైన డైలాగ్స్ చెప్పించి పొలిటికల్ లో కూడా చర్చ కు దారి తీసేలా చేసాడు హరీష్.
We’re now on WhatsApp. Click to Join.
‘‘నీ రేంజ్ ఇది అంటూ.. విలన్ టీ గ్లాస్ చూపిస్తూ.. దాన్ని కిందపడేసి పగలగొడతాడు. అప్పుడే.. పవన్ కల్యాణ్ మాస్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీలను చితక్కొడతాడు. ‘‘గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’’ అంటూ విలన్ పీక కోస్తాడు. ‘‘కచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాసంటే సైజు కాదు సైన్యం. కనిపించని సైన్యం’’ డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్‌తో టీజర్ ఎండ్ అయ్యింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో టాప్ వన్ గా ట్రెండ్ అవుతుంది. అభిమానులైతే ఈ టీజర్ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదే కదా మీము కోరుకున్నదంటూ హరీష్ కు థాంక్స్ చెపుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో పూనమ్.. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురాకుండా దేవిశ్రీప్రసాద్ ని ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేసింది. ” గుడ్ వన్ రాక్ స్టార్.. నువ్వు లేకుండా ఒక కమర్షియల్ సినిమా అనేది అసంపూర్ణం. మరోసారి నీ మ్యూజిక్ తో రాక్ చెయ్” అంటూ తాజాగా విడుదలైన వీడియోలో మ్యూజిక్ బాగుందంటూ దేవి శ్రీ ప్రసాద్ ని పొగిడింది. దీంతో పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొద్దీ రోజులుగా త్రివిక్రమ్ ఫై పలు కామెంట్స్ చేసి అభిమానుల్లో ఆగ్రహం నింపిన పూనమ్..ఇప్పుడు పవన్ విషయంలో పాజిటివ్ గా స్పందించే సరికి ఆశ్చర్యం వేస్తున్నారు.

Poonam Ustad
Read Also : Pithapuram : పిఠాపురం 2014 రికార్డు మార్జిన్‌ను అధిగమించగలదా..?