Pic Talk: బాస్ తో ‘భాయ్’.. సల్మాన్ కు చిరు స్వాగతం!
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా తెలిసింది.
- By Balu J Published Date - 12:04 PM, Wed - 16 March 22
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా తెలిసింది. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్లో సల్మాన్ ఖాన్ జాయిన్ అయ్యాడు. సల్మాన్ కు ఇది టాలీవుడ్ అరంగేట్రం. ఇద్దరు అతిపెద్ద సూపర్స్టార్లు మొదటిసారిగా స్క్రీన్ ను షేర్ చేసుకోవడం పట్ల గాడ్‌ఫాదర్ టీమ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది.
‘‘సల్మాన్ ఖాన్‌కి స్వాగతం! మీ ఎంట్రీ ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. మరింత ఉత్సాహం పెరిగింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందం. మీ ఉనికి ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు’’ అని ట్వీట్ చేసిన చిరు సల్మాన్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్‌కి అధికారిక రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చిరు సోదరిగా నయనతార నటిస్తుండగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు.
Welcome aboard #Godfather ,
Bhai @BeingSalmanKhan ! Your entry has energized everyone & the excitement has gone to next level. Sharing screen with you is an absolute joy. Your presence will no doubt give that magical #KICK to the audience.@jayam_mohanraja @AlwaysRamCharan pic.twitter.com/kMT59x1ZZq— Chiranjeevi Konidela (@KChiruTweets) March 16, 2022
Related News
Nani: హీరో నాని, సుజిత్ మూవీ ఆగిపోయిందా!
Nani: నాన్ థియేట్రికల్ మార్కెట్ పతనం, థియేట్రికల్ రంగంలో హెచ్చుతగ్గులు కొన్ని ప్రాజెక్టులకు పెను ముప్పుగా మారుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు సైన్ చేయగా, అది భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం బడ్జెట్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది. డ�