Power Glance: మీసం తిప్పి బరిలోకి దిగిన ‘వీరమల్లు’
పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్నచిత్రం 'హరిహర వీరమల్లు'.
- By Balu J Updated On - 11:23 AM, Sat - 3 September 22

పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్నచిత్రం ‘హరిహర వీరమల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ‘పవర్ గ్లాన్స్’ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ‘పవర్ గ్లాన్స్’ ఈ చిత్రంపై అంచనాలను ఎన్నో రేట్లు పెంచేలా ఉంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ”హరిహర వీరమల్లు” సినిమా రూపొంద నుండటంతో చిత్రం పై అంచనాలూ అధికంగానే ఉన్నాయి. ఈ ప్రచార చిత్రంలో వీరమల్లుగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ అత్యున్నత స్థాయిలో ఉంది.
మీసం తిప్పి, కదన రంగంలో అడుగుపెట్టి, మల్ల యోధులను మట్టి కరిపిస్తూ శక్తివంతమైన యోధుడు గా దర్శనమిచ్చారు పవర్ స్టార్. ఇక ఆయన తొడగొట్టే షాట్ అయితే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఎప్పటిలాగే ప్రశంసనీయం. ‘పవర్ గ్లాన్స్’ని బట్టి చూస్తే అద్భుతమైన కథ, అత్యద్భుతమైన విజువల్స్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్నో ఫ్యాన్‌బాయ్ మూమెంట్స్ ఉండనున్నాయని అర్థమవుతోంది. అభిమానులు తమ ఆరాధ్య నటుడు పుట్టినరోజును జరుపుకుంటున్న సమయంలో విడుదలైన ఈ పవర్ గ్లాన్స్ వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉంది. యాక్షన్, గ్రాండియర్, హీరోయిజం, కంటెంట్ మరియు క్లాస్ ఇలా అన్నింటితో కలిసి ఓ పవర్-ప్యాక్డ్ ఫిల్మ్ లా వస్తున్న ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం.
Related News

Pawan Kalyan: అన్నయ్య చిరంజీవి రివాల్వర్ తో కాల్చుకోవాలనుకున్నా: పవన్ కళ్యాణ్
తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ అందర్నీ ఆకర్షిస్తోంది.