Pawan Kalyan : కొండగట్టుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా అభిమానుల నీరాజనాలు
శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు బయల్దేరారు
- By Sudheer Published Date - 11:59 AM, Sat - 29 June 24

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరికాసేపట్లో కొండగట్టు (Kondagattu)కు చేరుకోనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ముందు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు పవన్. తన ప్రచార రథం వారాహికి కొండగట్టులోనే పూజలు చేయించి అక్కడి నుంచి వారాహి విజయ యాత్రను మొదలు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో పవన్ మరోసారి కొండగట్టు అంజన్నను దర్శించుకుంటున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్ కల్యాణ్‌ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన వీరఖడ్గంతో ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయల్దేరారు. దర్శనం అనంతరం సాయంత్రం ఆయన రోడ్డుమార్గంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చేరుకుంటారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. జులై 1 నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Read Also : NBK 109 : బాలకృష్ణ 109.. ఆ 3 టైటిల్స్ లో ఒకటి..!