Pawan Kalyan : సినిమా షూటింగ్స్‌కి పవన్.. ముందుగా ఆ సినిమానే..!
సినిమా షూటింగ్స్‌కి పవన్ రెడీ అవుతున్నారట. పాలిటిక్స్ తరువాత పవన్ నుంచి రాబోతున్న మొదటి సినిమా ఏదంటే..?
- By News Desk Published Date - 05:37 PM, Wed - 31 July 24

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆల్రెడీ సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. దీంతో అభిమానులంతా పవన్ మళ్ళీ షూటింగ్స్ లో ఎప్పుడు పాల్గొంటారో అని ఎదురు చూస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ పూర్తీ అయిన దగ్గర నుంచి.. పవన్ సినిమా షూటింగ్ అప్డేట్స్ ఇదిగో అదిగో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి తప్ప, అవి నిజం కావడం లేదు.
ఇక తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. సెప్టెంబర్ నుంచి పవన్ సినిమా షూటింగ్స్ కి డేట్స్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. సెప్టెంబర్ మూడో వారం నుంచి పవన్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనున్నారని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ ముందుగా ఏ సినిమాకి డేట్స్ ఇస్తున్నారు, ఏ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు అంటే.. ఓజి అనే వినిపిస్తుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ పూర్తీ చేసేసుకుంది. మిగిలిన షూటింగ్ కోసం పవన్ కేవలం రెండు వారలు డేట్స్ ఇస్తే సరిపోతుందని సమాచారం.
దీంతో పవన్ ముందుగా తన కాల్ షీట్స్ ని ఓజికే ఇవ్వనున్నారట. ఆ తరువాత హరిహర వీరమల్లు చిత్రీకరణలో పాల్గొనున్నారని తెలుస్తుంది. రెండు భాగాలుగా రాబోతున్న వీరమల్లు.. ఫస్ట్ పార్ట్ షూటింగ్ కూడా చివరిదశలో ఉంది. ఆ సినిమాకి కూడా కేవలం కొన్ని రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుందని సమాచారం. ఇక పవన్ రాక కోసం ఎదురు చూస్తున్న ఈ రెండు సినిమాల మేకర్స్.. షూటింగ్ ని వేగంగా పూర్తీ చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు.