Prakash Raj : ‘నువ్వు హిందూ ద్రోహివి ఆలయానికి ఎలా వెళ్తావు’ – ప్రకాష్ రాజ్ కు సూటి ప్రశ్న
Prakash Raj : 'నేపాల్ రాజధాని ఖాట్మండు(Kathmandu)లోని పశుపతినాథ్ ఆలయాన్ని(Pashupatinath Temple) సందర్శించారు
- By Sudheer Published Date - 01:38 PM, Sun - 29 September 24

ఖాట్మండు(Kathmandu)లోని పశుపతినాథ్ ఆలయాన్ని(Pashupatinath Temple) ప్రకాష్ రాజ్ సందర్శించడాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు మరికొందరు తప్పుపడుతూ.. ‘నువ్వు హిందూ ద్రోహివి ఆలయానికి ఎలా వెళ్తావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Controversy) ఫై ప్రకాష్ రాజ్ – పవన్ కళ్యాణ్ (Prakash Raj – Pawan Kalyan ) ల ట్వీట్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని..వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడతానంటూ…ఘాటు గా స్పందించడంతో పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ప్రకాష్ రాజ్ ఫై ఫైర్ అయ్యారు.
ఈ తరుణంలో ప్రకాష్.. నేపాల్ రాజధాని ఖాట్మండు(Kathmandu)లోని పశుపతినాథ్ ఆలయాన్ని(Pashupatinath Temple) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నేపాల్ ప్రజల ఆతిథ్యానికి, ప్రేమకు కృతజ్ఞత తెలుపుతూ టెంపుల్ వీడియోని పోస్ట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్‌తో పాటు మరికొందరు ‘నువ్వు హిందూ ద్రోహివి ఆలయానికి ఎలా వెళ్తావు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రకాష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
#Pashupatinath Temple.. #Kathmandu love you Nepal .. ❤️❤️❤️beautiful warm people.. thank you for all the love n warmth pic.twitter.com/izTg5ReXug
— Prakash Raj (@prakashraaj) September 29, 2024
Read Also : Hezbollah Unit 910 : రంగంలోకి హిజ్బుల్లా ‘యూనిట్ 910’.. ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్