HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Pawan And Jagan Not Attend Actor Alis Daughters Wedding

Ali Daughter Wedding: అలీ కుమార్తె పెళ్లికి ‘పవన్, జగన్’ డుమ్మా!

టాలీవుడ్  సీనియర్ హాస్యనటుడు అలీ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే.

  • By Balu J Updated On - 05:00 PM, Mon - 28 November 22
Ali Daughter Wedding: అలీ కుమార్తె పెళ్లికి ‘పవన్, జగన్’ డుమ్మా!

టాలీవుడ్  సీనియర్ హాస్యనటుడు ఆలీ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. దీనికి చిరంజీవి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అనుకోకుండా ఏపీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్ పెళ్లికి రాలేకపోయారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో చేరిన తర్వాత పవన్, అలీల మధ్య గ్యాప్ వచ్చిందని రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. పవన్ నిజంగానే ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని, అయితే విమానం ఆలస్యం కావడంతో, అందుకే రాలేకపోయారని అంటున్నారు. పవన్, అలీ మధ్య పెద్ద సమస్యలు లేవు అని పలువురు అంటున్నారు.

ఇటీవల అలీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని జగన్ కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం జగన్ కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే త్వరలో గుంటూరులో రిసెప్షన్ వేడుక ఉండబోతోందట. ఈ రిసెప్షన్ కి సీఎం జగన్, ఇతర మంత్రులు హాజరు కానున్నట్లు టాక్. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారా? లేరా అనేది వేచి చూడాల్సిందే.

నూతన జంటను ఆశీర్వదించినవారికి కృతజ్ఞతలు – డాక్టర్‌ ఆలీ

‘‘మా అమ్మాయి ఫాతిమా విహహం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. వధూవరులను ఆశీర్వదించటానికి సినిమా రంగంతో పాటు రాజకీయ, వ్యాపార రంగంలోని వారు పాల్గొని వధువు ఫాతిమా వరుడు షహయాజ్‌లను నిండుమనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి–సురేఖ, యస్‌స్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్, బ్రహ్మానందం, జయసుధ, నాగార్జున–అమలా, వెంకటేశ్, అనిల్‌ రావిపూడి, బోయపాటి శ్రీను, రాజశేఖర్‌–జీవిత, నిర్మాతలు అల్లు అరవింద్, కె.యల్‌ నారాయణ, ఎస్‌ గోపాల్‌రెడ్డి, చోటా.కె.నాయుడు, తనికెళ్ల భరణి, మంచు విష్ణు, లక్ష్మీ, తొట్టెంపూడి వేణు, ఆది సాయికుమార్, గౌతమ్‌ బ్రహ్మానందం, ఊహ, రోషన్, ‘అల్లరి’ నరేశ్, రాజేశ్, ప్రియదర్శి, పూరి జగన్నా«ద్‌ సతీమణి లావణ్య, ఆకాశ్‌ పూరి, పవిత్రా పూరిలతో పాటు నాతో అనేక సినిమాల్లో నటించిన తోటి నటీనటులు 200మంది వరకు హాజరై వధూవరులను దీవించారు. ప్రపంచ చాంపియన్‌ పి.వి సింధు తల్లితండ్రులతో సహా పెళ్లికి హాజరయ్యారు. ముస్లిం సాంప్రదాయంలో కన్నులపండుగలా జరిగిన ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రోజా, అవంతి శ్రీనివాస్, మార్గాని భరత్, ప్రత్తిపాటి పుల్లారావు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు. నా అతిధ్యాన్ని స్వీకరించి నూతన జంటను ఆశీర్వదించిన అతిరథ మహారధులందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’’ అని ఆలీ సంతోషం వ్యక్తం చేశారు.

Telegram Channel

Tags  

  • Ali
  • AP CM Jagan
  • daughter marriage
  • Pawan Kalyan

Related News

Pawan Kalyan: అన్నయ్య చిరంజీవి రివాల్వర్ తో కాల్చుకోవాలనుకున్నా: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: అన్నయ్య చిరంజీవి రివాల్వర్ తో కాల్చుకోవాలనుకున్నా: పవన్ కళ్యాణ్

తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ అందర్నీ ఆకర్షిస్తోంది.

  • AP Debts: ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ. 4,42,442 కోట్లు : తేల్చేసిన కేంద్రం

    AP Debts: ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ. 4,42,442 కోట్లు : తేల్చేసిన కేంద్రం

  • Pawan Kalyan Reveals: బ్రహ్మచారిగా ఉండలానుకున్నా.. కానీ 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది!

    Pawan Kalyan Reveals: బ్రహ్మచారిగా ఉండలానుకున్నా.. కానీ 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది!

  • Nick Vujicic Success Story: నిక్ జయించాడు.. మీరూ జయించగలరు!

    Nick Vujicic Success Story: నిక్ జయించాడు.. మీరూ జయించగలరు!

  • TDP-Janasena : జ‌న‌సేన‌తో పొత్తు టీడీపీకి మూడందాల చేటు, 30 చోట్ల అల‌జ‌డి

    TDP-Janasena : జ‌న‌సేన‌తో పొత్తు టీడీపీకి మూడందాల చేటు, 30 చోట్ల అల‌జ‌డి

Latest News

  • Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిపై కేటీఆర్ రివ్యూ

  • Double Decker buses: డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్..!

  • Kiara Advani weds Sidharth Malhotra: ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ జంట.. పిక్స్ వైరల్!

  • UP: యూపీలో దారుణం, మృతదేహాన్ని 10కిమీ ఈడ్చుకెళ్ళిన కారు.

  • Shraddha Walker: శ్రద్ధ వాకర్ కేసులో విస్తుపోయే విషయాలు… 35 ముక్కలుగా నరికి, ఎముకలు గ్రైండర్!

Trending

    • Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

    • Balakrishna : నోరు జార‌లేదు..వ‌క్రీక‌రించారు! చింతిస్తున్నా..మీ బాల‌య్య‌.!

    • PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు

    • Oppo Reno 8T: ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో రెనో 8టీ

    • Modi@1: మన మోడీ వరల్డ్ నంబర్ 1

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: