Pawan Kalyan : సొంత సినిమా పేరే మర్చిపోయిన పవన్ కళ్యాణ్.. ఆ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన రాబోయే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) పేరు మర్చిపోయి తడబడ్డాడు. కిందున్నవాళ్ళు అందిస్తే ఆ సినిమా పేరు చెప్పాడు.
- By News Desk Published Date - 04:24 PM, Wed - 25 October 23

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఓ పక్క సినిమాలు.. మరో పక్క రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఇటీవల మహా మ్యాక్స్ అనే ఓ కొత్త ఛానల్ లాంచ్ అయింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన రాబోయే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) పేరు మర్చిపోయి తడబడ్డాడు. కిందున్నవాళ్ళు అందిస్తే ఆ సినిమా పేరు చెప్పాడు.
దీంతో తాను చేసే సినిమా పేరు కూడా గుర్తులేదా అని పలువురు నెటిజన్లు, యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తడబడిన వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దీనిపై స్పందించాడు.
సోషల్ మీడియాలో పవన్ తడబడిన వీడియోని రీ షేర్ చేసి.. ఒరిజినల్ టైటిల్ చెప్పినా.. ఇంత వైరల్ అయ్యేది కాదు. పోనీలెండి అన్ని మన మంచికే. హ్యాపీ దసరా అని పోస్ట్ చేసాడు. అందరూ తన సినిమా పేరు పవన్ మర్చిపోయినందుకు హరీష్ శంకర్ బాధపడతాడు అనుకుంటే ఇలా పాజిటివ్ గా కామెంట్స్ చేయడంతో ఇప్పుడు హరీష్ ట్వీట్ వైరల్ గా మారింది.
Original టైటిల్ చెప్పినా,
ఇంత వైరల్ అయ్యేది కాదు
పోనీలెండి అన్ని మన మంచికే
హ్యాపీ దసరా#UstaadBaghatSingh https://t.co/7B7HdSqY8i
— Harish Shankar .S (@harish2you) October 24, 2023
Also Read : Dhanraj : డైరెక్టర్ గా మారిన మరో జబర్దస్త్ కమెడియన్.. హీరోగా చేస్తూనే దర్శకత్వం కూడా..