Alekhya Reddy: మరోసారి అలేఖ్య రెడ్డి షాకింగ్ పోస్ట్… ఎమోషన్ అయిపోయిన ఫ్యాన్!
నందమూరి ఫ్యామిలీలో అత్యంత మంచి వ్యక్తుల్లో నందమూరి తారకరత్న ఒకరు.ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.
- Author : Anshu
Date : 09-04-2023 - 11:14 IST
Published By : Hashtagu Telugu Desk
Alekhya Reddy: నందమూరి ఫ్యామిలీలో అత్యంత మంచి వ్యక్తుల్లో నందమూరి తారకరత్న ఒకరు.ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆయన మరణంతో అలేఖ్య రెడ్డి ఫ్యామిలీ ఒంటరి అయిపోయింది. ఆర్థికంగా ఎవరూ ఎంత ఆదుకున్నా పోయిన మనిషిని మాత్రం ఎవరూ తెచ్చి ఇవ్వలేదు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే తారకత్న గుర్తు వచ్చిన ప్రతిసారి, అలేఖ్య రెడ్డి ఆయన్ను గుర్తు చేసుకొని బాధపడుతూనే ఉంది. తాజాగా ఓ పోస్ట్ ను అలేఖ్య రెడ్డి పోస్ట్ చేసింది. దీనిపై కన్నీరు పెట్టిందే కామెంట్స్ వస్తున్నాయి.
తారకరత్న మీద ఆమెకున్న ప్రేమను అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తెలియజేస్తుంది. తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డి తరచుగా సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. ఆ మధ్య ఆమె ఓ సుదీర్ఘ సందేహం పోస్ట్ చేశారు. తనను ప్రేమ పెళ్లి చేసుకున్న తారకరత్న ఎంతటి మానసిక వేదనకు గురయ్యాడు. ఎన్ని అవమానాలు అనుభవించారో చెప్పారు.
తన సందేశంలో అలేఖ్య తారకరత్నతో పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాలు ప్రస్తావించారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు ఎదురైన కష్టాలు వివరించారు. అయిన వాళ్ళే పలు మార్లు బాధపెట్టారని అసహనం వ్యక్తం చేశారు. మన పరిచయం ప్రేమగా మారింది. నా మనసులో ఎక్కడో ఒక సందిగ్దత ఉండేది. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవాలన్న స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళావు. మన పెళ్లి నిర్ణయం అందరికీ దూరం చేసింది. మానసిక ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులపాలు చేసింది. కొందరి ద్వేషాన్ని చూడలేక మనం కళ్ళకు గంతలు కట్టుకున్నాం.
కుటుంబానికి దూరం కావడం వలన పెద్ద కుటుంబం కావాలనుకున్నావు. పిల్లలు పుట్టాక మన జీవితం మారిపోయింది. సంతోషం నిండింది. నువ్వు రియల్ హీరో. మళ్ళీ మనం కలుస్తామని ఆశిస్తున్నానని తన భావోద్వేగం బయటపెట్టారు. మామయ్య బాలకృష్ణ, పెదనాన్న విజయసాయి రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.